ప్రతిపక్షం గొంతు నొక్కేందుకు కుట్ర
ఎమ్మెల్యే పీఆర్కే
మాచర్ల: రాష్ట్రంలో అన్ని వర్గాల ప్రజలను మోసగిస్తున్న సీఎం చంద్రబాబు తీరును ఎండగడుతూ ప్రత్యేక హోదా సాధనకై పోరాడుతున్న చేస్తున్న వైయస్సార్ సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి, ఎంపీ విజయసాయిరెడ్డి, తిరుపతి ఎమ్మెల్యే భూమా కరుణాకర్‌రెడ్డిని వేధించేలా ప్రభుత్వం వ్యవహరిస్తోందని పార్టీ విప్, ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి అన్నారు. సోమవారం పార్టీ నాయకులతో కలసి కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు. కేంద్ర ప్రభుత్వంలో భాగస్వామిగా ఉన్న చంద్రబాబు హోదా కంటే ప్యాకేజీ మిన్న అని మాట్లాడడం అంత్యంత దారుణమన్నారు. రాష్ట్రంలోని ప్రజలను చైతన్య పరుస్తూ హోదా కోసం పోరాటం చేస్తున్న జగన్‌ను, పార్టీ నాయకులను ఏదో విధంగా ఇబ్బందులకు గురిచేసేందుకు వివిధ వ్యవస్థలను ఉపయోగించుకుని చంద్రబాబు అధికార దుర్వినియోగానికి పాల్పడుతురని విమర్శించారు. టీడీపీలో ఉండి పలు కేసుల్లో నిందితులుగా వున్న కొందరు నాయకులపై ఉన్న కేసులు ఎత్తివేసే విధంగా చర్యలు తీసుకుంటున్న చంద్రబాబు ప్రతి పక్షానికి చెందిన నాయకులపై మాత్రం అక్రమ కేసులు » నాయించి విచారణ పేరుతో వేధింపులకు గురిచేస్తున్నారని విమర్శించారు.