లోయర్ ట్యాంక్‌బండ్ ప్రాంతంలోని కట్టమైసమ్మ ఆలయం సమీపంలో కరెంట్ స్తంభానికి ఉరివేసుకుని రైతు లింబయ్య ఆత్మహత్య చేసుకోవడానికి వ్యవసాయ రుణాలు ఎంతమాత్రం కారణం కాదని తెలంగాణ సీఎంవో కార్యాలయం తెలిపింది.
హైదరాబాద్:లోయర్ ట్యాంక్‌బండ్ ప్రాంతంలోని కట్టమైసమ్మ ఆలయం సమీపంలో కరెంట్ స్తంభానికి ఉరివేసుకుని రైతు లింబయ్య ఆత్మహత్య చేసుకోవడానికి వ్యవసాయ రుణాలు ఎంతమాత్రం కారణం కాదని తెలంగాణ సీఎంవో కార్యాలయం తెలిపింది. ఈ మేరకు గురువారం ఓ ప్రకటన విడుదల చేసింది.
లింబయ్య మృతి ఘటనపై అధికారులతో దర్యాప్తు చేయించామని.. అతని మృతికి వ్యవసాయ రుణాలు ఎంతమాత్రం కాదని పేర్కొంది. లింబయ్య మూడెకరాల్లో వేసిన పంట మంచిస్థితిలోనే ఉందని, ఆర్థిక పరిస్థితి కూడా బాగానే ఉందని సీఎంవో తెలిపింది. కొంతమంది రైతులకు లింబయ్య స్వయంగా అప్పులు కూడా ఇస్తున్నాడని పేర్కొంది. లింబయ్యతో పాటు కుమారుడు తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్నాడని తెలిపింది.