పాల్వంచ: పాల్వంచ మండలం కుంటినాగులగూడెం వద్ద బైక్ అదుపు తప్పి కల్వర్టును ఢీకొట్టింది. ఈ ఘటనలో బైక్‌పై ప్రయాణిస్తున్న ముగ్గురిలో ఇద్దరు అక్కడికక్కడే మృతిచెందగా..మరొకరికి తీవ్రగాయాలు అయ్యాయి. క్షతగాత్రుడిని చికిత్స నిమిత్తం స్థానిక ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మృతుల వివరాలు తెలియాల్సి ఉంది.