దోమ/కౌడిపల్లి: సెల్‌ఫోన్‌కు చార్జింగ్ పెడుతూ వేర్వేరు ప్రాంతాల్లో బుధవారం విద్యుదాఘాతానికి గురై ఇద్దరు వ్యక్తులు మృతి చెందారు. రంగారెడ్డి జిల్లా దోమ మండలం దాదాపూర్ తండాకు చెందిన సభావత్ రాజు(32), మెదక్ జిల్లా నారాయణఖేడ్ మండలం అనంతసాగర్ పంచాయతీ గౌరారానికి చెందిన వడిత్య వెంకట్‌నాయక్(42)లు బుధవారం సెల్‌ఫోన్‌కు చార్జింగ్ పెడుతుండగా కరెంట్ షాక్‌కు గురై మృతి చెందారు.