అనుమతిలేని ఆస్పత్రి సీజ్
అనుమతిలేని ఆస్పత్రి సీజ్
Published Wed, May 24 2017 11:05 PM | Last Updated on Sat, Sep 15 2018 3:43 PM
కోడుమూరు రూరల్ : ఎలాంటి అనుమతుల్లేకుండా కోడుమూరు పట్టణంలో వైద్యం, స్కానింగ్ పరీక్షలు నిర్వహిస్తున్న బాషా నర్సింగ్ హోమ్‌ను డీఎంఅండ్‌హెచ్‌ఓ మీనాక్షి మహాదేవ్ బుధవారం సాయంత్రం సీజ్ చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ అనుమతుల్లేకుండా స్కానింగ్ పరీక్షలు నిర్వహిస్తే కఠిన చర్యలు తప్పవన్నారు. ఈనెల 19వతేదీ కోడుమూరులోని బాషా నర్సింగ్ హోమ్ తనిఖీ చేయగా, స్కానింగ్ మిషన్‌తో పాటు, వైద్యుడు పరారయ్యాడన్నారు. అస్పత్రిలోని రోగులను విచారించగా స్కానింగ్ పరీక్షలు చేస్తున్నారన్న విషయం రుజువైందన్నారు. ఎలాంటి అర్హత పొందిన డాక్టర్లు, సిబ్బంది లేకుండానే ఆస్పత్రిని నిర్వహిస్తున్నట్లు తమ విచారణలో తేలిందన్నారు. దీంతో బాషా నర్సింగ్ హోమ్‌ను సీజ్ చేసి, అస్పత్రిలోని రోగులను స్థానిక ప్రభుత్వాసుపత్రికి తరలించినట్లు మీనాక్షిమహాదేవ్ వివరించారు. కార్యక్రమంలో డిప్యూటీ హెచ్‌ఓ ఎర్రంరెడ్డి, హెచ్‌ఈఓ సత్యనారాయణ, లీగల్ కన్సల్‌టెంట్ మాధవి, కోడుమూరు ప్రభుత్వాసుపత్రి వైద్యాధికారి ప్రకాశం, వీఆర్వో వెంకట్రాముడు తదితరులున్నారు.
Advertisement