చికిత్స పొందుతూ రైతు మృతి | Undergoing treatment Death of Farmer | Sakshi
Sakshi News home page

చికిత్స పొందుతూ రైతు మృతి

Published Sat, Jul 16 2016 11:39 PM | Last Updated on Sat, Sep 29 2018 5:33 PM

చికిత్స పొందుతూ రైతు మృతి - Sakshi

చికిత్స పొందుతూ రైతు మృతి

బేల: మండలంలోని సిర్సన్న గ్రామానికి చెందిన బండారి భోజా రెడ్డి(50) జిల్లా కేంద్రంలోని రిమ్స్‌లో చికిత్స పొందుతూ శుక్రవారం రాత్రి మృతి చెందాడు. పోలిసులు తెలిపిన వివరాల ప్రకారం..సిర్సన్న గ్రామానికి చెందిన రైతు బండారి భోజా రెడ్డి ఇంటి నుంచి శుక్రవారం సాయంత్రం గ్రామ రెవెన్యూ శివారులోని చేనును చూడడానికి ద్విచక్ర వాహనంపై బయలు దేరాడు. ఈ క్రమంలో అంతరాష్ట్ర రోడ్డుపై కల్వర్టు పనులను చేస్తున్న కాంక్రీటు మిక్సర్ మిల్లర్ ఉన్న చోట నుంచి డ్రైవర్ నిర్లక్ష్యంతో ఆకస్మాత్తుగా వెనుకకు మలుపగా, ఈ ద్విచక్ర వాహనాన్ని ఢీ కొన్నది.

దీంతో ఈ ద్విచక్ర వాహనంపై ఉన్న రైతు బండారి భోజా రెడ్డి నడుము, పొట్ట, మొకాలుకు తీవ్ర గాయాలయ్యాయి. దీన్ని తెలుసుకున్న స్థానికులు తీవ్ర గాయాలపాలైన ఈ రైతును వైద్య కోసం జిల్లా కేంద్రంలోని రిమ్స్‌కు తరలించారు. కాగా చికిత్స పొందుతూ రాత్రి ఈ రైతు మృతిచెందాడు. మృతుడికి భార్య, ఒక కూమారుడు, ఒక కూమార్తెలు ఉన్నారు. ఈ మేరకు కేసు నమోదు చేసి, దర్యాప్తు జరుపుతున్నట్లు ప్రొబెషనరీ ఎసై్స జిల్లెల రమేష్ తెలిపారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement