Death of Farmer
-
ఏనుగు దాడిలో రైతు మృతి
చింతలమానెపల్లి (సిర్పూర్): ఏనుగు దాడిలో ఓ రైతు మృత్యువాత పడ్డాడు. మహారాష్ట్రలోని అటవీప్రాంతం నుంచి బుధవారం తెల్లవారుజామున ప్రాణహిత నది దాటి కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లా చింతలమానెపల్లి మండలం బూరెపల్లి సమీపంలోని వ్యవసాయ భూము ల్లోకి చొరబడింది. అక్కడే ఉన్న ఓ రైతుపై దాడి చేయగా, తీవ్రంగా గాయపడిన రైతు అక్కడికక్కడే మృతిచెందాడు. ఈ ఘటన వివరాలిలా ఉన్నాయి. బుధవారం ఉదయం బూరెపల్లిసమీపంలోని ప్రాణహిత నదిలో ఏనుగును గ్రామస్తులు కొంతమంది గమనించారు. ప్రాణహిత నది నుంచి బూరెపల్లి వ్యవసాయ భూముల వైపు వెళ్లింది. ఆ సమయంలోనే గ్రామ శివారులోని మిరపతోటలో అల్లూరి శంకర్(55) భార్య సుగుణబాయి, మరికొందరితో కలిసి పనులు చేసుకుంటున్నాడు. ఏనుగు రాకను గమనించిన సుగుణ బాయి భర్తతోపాటు కూలీలను అప్రమత్తం చేస్తూ పరుగెత్తింది. తోట నుంచి వెళ్లలేకపోయిన శంకర్ అక్కడే ఓ చోట దాక్కున్నాడు. నేరుగా అక్కడికే వచ్చిన ఏనుగు శంకర్‌ను తొండంతో పైకి లేపి విసిరింది. ఎగిరి కింద పడిన అతడిని మళ్లీ కాలితో తొక్కడంతో గాయపడి అక్కడికక్కడే మృతిచెందాడు. ఏనుగు అక్కడి నుంచి బాబాపూర్ వైపు వెళ్లడంతో కుటుంబసభ్యులు శంకర్ మృతదేహం వద్దకు వెళ్లారు. శంకర్‌కు నలుగురు కుమార్తెలు ఉన్నారు. బాధిత కుటుంబాన్ని కాగజ్‌నగర్ డీఎస్పీ కరుణాకర్, డీఎఫ్ఓ నీరజ్‌కుమార్ పరామర్శించారు. తక్షణ సాయం కింద రూ.10వేలు అందించారు. చిక్కని ఏనుగు: కౌటాల సీఐ సాదిక్ పాషా, ఖర్జెల్లి రేంజ్ అధికారి చంద్రమౌళి ఆధ్వర్యంలో బృందాలు ఏనుగును అనుసరించాయి. గంగాపూర్ నుంచి ప్రాణహిత–చేవెళ్ల ప్రాజెక్టు కాలువల మీదుగా ఖర్జెల్లి వైపు వెళ్లినట్లు గుర్తించారు. ఖర్జెల్లి గ్రామస్తులు ఏనుగు గ్రామం వైపు రాకుండా మంటలు పెట్టారు. రాత్రి కావడంతో ఏనుగు వెళుతున్న మార్గాల్లోని గ్రామాల ప్రజలను అప్రమత్తం చేశారు. రాకపోకలు నిలిపివేశారు. రాత్రి పది గంటల వరకు రుద్రాపూర్ సమీపంలో ఏనుగు ఉన్నట్లు గుర్తించారు. రూ.10 లక్షల ఎక్స్‌గ్రేషియా : మంత్రి కొండా సురేఖ ఏనుగు దాడిలో అల్లూరి శంకర్ మృతి చెందడం పట్ల మంత్రి కొండా సురేఖ ఆవేదన వ్యక్తం చేశారు. బాధిత కుటుంబానికి రూ.10 లక్షల ఎక్స్‌గ్రేషియా ప్రకటించారు. ప్రభుత్వ మార్గదర్శకాలకు అనుగుణంగా ఈ మొత్తాన్ని వెంటనే అందజేస్తామన్నారు. -
రైతు మృతిపై ఆందోళన
భైంసాలో ఉద్రిక్తత ఎస్సైని సస్పెండ్ చేయాలని డిమాండ్ భైంసా/భైంసారూరల్/తానూరు: నిర్మల్ జిల్లాలోని భైంసా డివిజన్ కేంద్రంలో మంగళవారం సుమారు నాలుగు గంటలపాటు తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. తానూరుకు చెందిన రైతు హున్‌గుందే రమేశ్(36)ది హత్యేనని ఆరోపిస్తూ అతని కుటుంబీకులు, బంధువులు, హిందూ వాహిని శ్రేణులు, బీజేపీ నాయకులు, తానూరు మండలానికి చెందిన పలువురు ఆందోళనకు దిగారు. తానూర్‌కు చెందిన హున్‌గుందే రమేశ్(36) వ్యవసాయం చేసుకునే వాడు. కొద్ది రోజుల క్రితం పక్కనే ఉన్న పంట చేను వారితో గొడవలు జరిగాయి. ఈ గొడవలు పోలీస్‌స్టేషన్ వరకు వెళ్లాయి. ఈ మేరకు కేసులు నమోదు చేసి తానూరు ఎస్సై విచారణ చేపట్టారు. ఆ తర్వాత రమేశ్ తనకు ప్రాణభయం ఉందని రక్షణ కల్పిం చాలని మరోమారు పోలీసుల వద్దకు వెళ్లాడు. అయితే, పోలీసులు స్పందించలేదు. ఈ క్రమం లోనే రైతు రమేశ్ ఆది వారం ఇంటి నుంచి వెళ్లి సోమవారం ఊరవతల చెట్టుకు వేలాడుతూ విగత జీవిగా కనిపించాడు. ఎస్సై నిర్లక్ష్యం వల్లే రమేశ్ హత్య జరిగిందని.. చంపి చెట్టుకు వేలాడదీశారని మృతుడి కుటుంబీకులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మృతదేహంతో సోమవారమే ఆందోళనకు దిగారు. అంతటితో ఆగకుండా మం గళవారం ఉదయం నుంచి 4 గంటలపాటు రాస్తారోకో చేశారు. ఎస్సైని సస్పెండ్ చేయాలని... తానూరు ఎస్సైని సస్పెండ్ చేయాలని, డిమాండ్లు నెరవేర్చాలని డిమాండ్ చేశారు. ఆందోళన కారులు భైంసా బస్టాండ్‌ను దిగ్బంధనం చేశారు. దీంతో ఆర్టీసీ అధికారులు పలు ప్రాంతాల్లో తాత్కాలిక బస్టాండ్లను ఏర్పాటు చేసి బస్సుల రాకపోకలు కొనసాగేలా చూశారు. వారి డిమాం డ్లను ఉన్నతాధికారులకు నివేదిస్తానని తహసీ ల్దార్ సుభాష్‌చందర్ తెలిపారు. హత్య కారకులను పట్టుకుంటామని డీఎస్పీ రాములు హామీనివ్వడంతో ఆందోళన విరమించారు. ఆ తర్వాత భైంసా ఆస్పత్రి నుంచి మృతదేహాన్ని స్వస్థలం తానూరుకు తరలించి అంత్యక్రియలు నిర్వహించారు. యువ రైతు హత్యకు నిరసనగా వ్యాపారులు స్వచ్ఛందంగా బంద్ పాటించారు. -
చికిత్స పొందుతూ రైతు మృతి
బేల: మండలంలోని సిర్సన్న గ్రామానికి చెందిన బండారి భోజా రెడ్డి(50) జిల్లా కేంద్రంలోని రిమ్స్‌లో చికిత్స పొందుతూ శుక్రవారం రాత్రి మృతి చెందాడు. పోలిసులు తెలిపిన వివరాల ప్రకారం..సిర్సన్న గ్రామానికి చెందిన రైతు బండారి భోజా రెడ్డి ఇంటి నుంచి శుక్రవారం సాయంత్రం గ్రామ రెవెన్యూ శివారులోని చేనును చూడడానికి ద్విచక్ర వాహనంపై బయలు దేరాడు. ఈ క్రమంలో అంతరాష్ట్ర రోడ్డుపై కల్వర్టు పనులను చేస్తున్న కాంక్రీటు మిక్సర్ మిల్లర్ ఉన్న చోట నుంచి డ్రైవర్ నిర్లక్ష్యంతో ఆకస్మాత్తుగా వెనుకకు మలుపగా, ఈ ద్విచక్ర వాహనాన్ని ఢీ కొన్నది. దీంతో ఈ ద్విచక్ర వాహనంపై ఉన్న రైతు బండారి భోజా రెడ్డి నడుము, పొట్ట, మొకాలుకు తీవ్ర గాయాలయ్యాయి. దీన్ని తెలుసుకున్న స్థానికులు తీవ్ర గాయాలపాలైన ఈ రైతును వైద్య కోసం జిల్లా కేంద్రంలోని రిమ్స్‌కు తరలించారు. కాగా చికిత్స పొందుతూ రాత్రి ఈ రైతు మృతిచెందాడు. మృతుడికి భార్య, ఒక కూమారుడు, ఒక కూమార్తెలు ఉన్నారు. ఈ మేరకు కేసు నమోదు చేసి, దర్యాప్తు జరుపుతున్నట్లు ప్రొబెషనరీ ఎసై్స జిల్లెల రమేష్ తెలిపారు.