Undergoing treatment
-
ప్రముఖ పారిశ్రామికవేత్త, టాటా సన్స్ గౌరవ చైర్మన్ రతన్ టాటా అస్తమయం... అనారోగ్యంతో చికిత్స పొందుతూ తుదిశ్వాస
-
చికిత్స పొందుతూ మహిళ మృతి
నాడు తండ్రి.. నేడు తల్లి మృతి అనాథలైన చిన్నారులు పరకాల : ఆర్థిక పరిస్థితులు అనుకూలించక ఆత్మహత్యకు యత్నించిన ఓ వివాహిత ఆస్పత్రిలో చికిత్సపొందుతూ శనివారం మృతిచెందింది. కుటుంబ సభ్యుల కథనం ప్రకారం.. మండలంలోని పులిగిల్ల గ్రామానికి చెందిన పెండెల మౌనిక(29)కు వెల్లంపల్లి గ్రామానికి చెందిన రాజుతో ఎనిమిదేళ్ల క్రితం వివాహమైంది. వారికి ఇద్దరు పిల్లలున్నారు. రాజు అనారోగ్యానికి గురికావడంతో ఆస్పత్రులు చుట్టూ తిరిగారు. ఆరోగ్యం కుదుటపడకపోవడంతో ఐదేళ్ల క్రితం రాజు మృతిచెందాడు. అప్పటి నుంచి మౌనిక తన ఇద్దరు పిల్లలను తీసుకొని వచ్చి పులిగిల్లలోనే నివాసముంటోంది. తల్లిదండ్రులు ఇచ్చిన 20 గుంటల భూమిని సాగు చేసుకుంటున్నారు. భర్త రాజును ఆస్పత్రిలో చూపించడానికి చేసిన అప్పులతోపాటు, వ్యవసాయం కోసం చేసిన అప్పులు ఎక్కువయ్యాయి. అప్పులు ఎలా తీర్చాలని మనోవేదనకు గురైన మౌనిక ఈ నెల 20న ఇంట్లో ఉన్న పురుగుల మందు తాగింది. ఆమెను ఎంజీఎం ఆస్పత్రికి తరలించగా చికిత్సపొందుతూ శనివారం ఉదయం మృతిచెందింది. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. కాగా తల్లిదండ్రుల మృతితో ఇద్దరు పిల్లలు అనాథలయ్యారు. -
చికిత్స పొందుతూ రైతు మృతి
బేల: మండలంలోని సిర్సన్న గ్రామానికి చెందిన బండారి భోజా రెడ్డి(50) జిల్లా కేంద్రంలోని రిమ్స్‌లో చికిత్స పొందుతూ శుక్రవారం రాత్రి మృతి చెందాడు. పోలిసులు తెలిపిన వివరాల ప్రకారం..సిర్సన్న గ్రామానికి చెందిన రైతు బండారి భోజా రెడ్డి ఇంటి నుంచి శుక్రవారం సాయంత్రం గ్రామ రెవెన్యూ శివారులోని చేనును చూడడానికి ద్విచక్ర వాహనంపై బయలు దేరాడు. ఈ క్రమంలో అంతరాష్ట్ర రోడ్డుపై కల్వర్టు పనులను చేస్తున్న కాంక్రీటు మిక్సర్ మిల్లర్ ఉన్న చోట నుంచి డ్రైవర్ నిర్లక్ష్యంతో ఆకస్మాత్తుగా వెనుకకు మలుపగా, ఈ ద్విచక్ర వాహనాన్ని ఢీ కొన్నది. దీంతో ఈ ద్విచక్ర వాహనంపై ఉన్న రైతు బండారి భోజా రెడ్డి నడుము, పొట్ట, మొకాలుకు తీవ్ర గాయాలయ్యాయి. దీన్ని తెలుసుకున్న స్థానికులు తీవ్ర గాయాలపాలైన ఈ రైతును వైద్య కోసం జిల్లా కేంద్రంలోని రిమ్స్‌కు తరలించారు. కాగా చికిత్స పొందుతూ రాత్రి ఈ రైతు మృతిచెందాడు. మృతుడికి భార్య, ఒక కూమారుడు, ఒక కూమార్తెలు ఉన్నారు. ఈ మేరకు కేసు నమోదు చేసి, దర్యాప్తు జరుపుతున్నట్లు ప్రొబెషనరీ ఎసై్స జిల్లెల రమేష్ తెలిపారు.