సంగారెడ్డి డివిజన్, న్యూస్‌లైన్ :
పది జిల్లాలతో కూడిన తెలంగాణ ప్రకటించిన కేంద్రం హైదరాబాద్‌ను యూటీ చేయాలనే ప్రతిపాదనను పరిగ ణలోకి తీసుకోవటం సరికాదని లోక్‌సత్తా జిల్లా అధ్యక్షుడు తుమ్మనపల్లి శ్రీనివాస్ అన్నారు. గురువారం స్థానిక ప్రభుత్వ అతిథి గృహంలో లోక్‌సత్తా కార్యకర్తల సమావేశం జరిగింది. సమావేశంలో ఆయన మాట్లాడుతూ తెలంగాణ ఏర్పాటు చేస్తూ పార్లమెంట్‌లో వెంటనే బిల్లు ప్రవేశపెట్టాలని ఆయన కేంద్రాన్ని డిమాండ్ చేశారు. విభజన తర్వాత తలెత్తే సమస్యలను రాజ్యాంగ బద్ధంగా పరిష్కరించుకోవచ్చన్నారు.
కొంతమంది ప్రజాస్వామ్యం, చట్టసభల మీద నమ్మకం లేకనే రోడ్లుపైకి వస్తున్నట్లు చెప్పారు. విభజన ప్రక్రియకు సంబంధించి సమస్యలను నివేదించేందుకు కేంద్రం కమిటీ వేయాలని డిమాండ్ చేశారు. నేరస్తులుగా శిక్షపడిన వారు చట్టసభలకు పోటీచేసేందుకు అనర్హులంటూ సుప్రీంకోర్టు తీర్పు ఇవ్వటం హర్షణీయమని పేర్కొన్నారు. ప్రజాప్రాతినిధ్య చట్టంలోని 8 (4) విభాగాన్ని కొట్టేస్తూ సుప్రీం ఇచ్చిన తీర్పు తిరుగులేనిదని తెలిపారు. రాజకీయపార్టీలు సేకరించే వివరాళాలు చట్టబద్దంగా సేకరించాలని ఎన్నికల కమిషన్ పార్టీలకు లేఖ రాయటం శుభపరిణామంగా పేర్కొన్నారు. దేశంలో ఒక పార్టీకి వచ్చే విరాళాలు, ఆదాయవ్యయం వివవరాలను ఆన్‌లైన్‌లో ఉంచిన ఏకైక పార్టీ లోక్‌సత్తా అని తుమ్మనపల్లి శ్రీనివాస్ తెలిపారు. కార్యక్రమంలో లోక్‌సత్తా నియోజకవర్గ ఇన్‌చార్జ్ మాధవరెడ్డి, యువసత్తా జిల్లా అధ్యక్షుడు ఎం శ్రీధర్, నాయకులు నిజాముద్దీన్, సాయికుమార్, అఫ్రోజు, సదాశివపేట పట్టణ నాయకులు సాయిరాజ్, నరేష్, నర్సింలు, నారాయణ, వెంకట్, నర్సింహ్మారెడ్డి పాల్గొన్నారు.
యూటీ అనటం సరికాదు
Published Fri, Sep 6 2013 1:39 AM | Last Updated on Fri, Sep 1 2017 10:28 PM
Advertisement
Advertisement