వెల్దుర్తి: గుంటూరు జిల్లా వెల్దుర్తి మండలం వజ్రాలపాడు తండాలోని రంగమూడి కుంట వద్ద ఓ గుర్తుతెలియని వ్యక్తి ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. స్థానికులు గమనించి ఈ విషయాన్ని పోలీసులకు తెలియజేశారు. ఆత్మహత్యకు పాల్పడిన వ్యక్తి వయసు సుమారు 40 నుండి 50 సంవత్సరాల మధ్య ఉన్నట్లు తెలుస్తోంది. మృత దేహాన్ని పరిశీలించిన పోలీసులు.. మూడు రోజుల క్రితమే ఆత్మహత్యకు పాల్పడి ఉండవచ్చునని భావిస్తున్నారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.