Strangled
-
ఐదు రూపాయల కాయిన్ గొంతులో ఇరుక్కొని
మైసూరు: కాయిన్ గొంతులో ఇరుక్కుని నాలుగేళ్ల చిన్నారి మృతి చెందిన ఘటన మైసూరు జిల్లా హుణసూరు తాలుకాలో ఆయరహళ్లి గ్రామంలో చోటు చేసుకుంది. తాలూకాలోని ఆయురహళ్లి గ్రామానికి చెందిన ఖుషీ (4) తన అవ్వ ఇంటి వద్ద ఆడుకుంటూ తన చేతిలో ఉన్న ఐదు రూపాయల కాయిన్‌ను నోటిలో పెట్టుకుంది. అది పొరపాటును గొంతులోకి జారి ఇరుక్కుపోయింది. చిన్నారిని హుటాహుటిన ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించగా అక్కడ చికిత్స పొందుతూ సోమవారం మృతి చెందింది. చదవండి: ప్రియుడితో సహజీవనం.. చివరికి ఏం జరిగిందంటే? చదవండి: వర్షాల కోసం నగ్నంగా బాలికల ఊరేగింపు -
బద్వేల్లో దారుణం.. యువతి గొంతుకోసి చంపిన ప్రేమోన్మాది
సాక్షి, వైఎస్సార్ కడప: జిల్లాలోని బద్వేలు మండలంలో ఓ ప్రేమోన్మాది ఘాతుకానికి పాల్పడ్డాడు. తన ప్రేమను నిరాకరించిందని యువతి గొంతు కోసి హత్య చేశాడు యువకుడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. బద్వేలు మండలం చింతల చెరువు గ్రామానికి చెందిన సుబ్బయ్య, సుబ్బమ్మకు 18 ఏళ్ల కూతురు శిరీష ఉంది. ఆమె బద్వేల్ వీరారెడ్డి కాలేజీలో డిగ్రీ సెకండ్ ఇయర్ చదువుతోంది. గత కొంత కాలంగా కచరణ్ అనే యువకుడు శిరీషను ప్రేమిస్తున్నానంటూ ఆమె వెంట పడుతున్నాడు. ప్రస్తుతం కాలేజీ సెలవులు కావడంతో ఇంటి వద్దనే ఉంటోంది. ఈ క్రమంలో చరణ్ శుక్రవారం చింతల చెరువు గ్రామంలోకి వెళ్లి శిరీషను బలవంతం చేశాడు. అందుకు ఆమె నిరాకరించడంతో అక్కడే ఉన్న కత్తితో శిరీష గొంతు కోశాడు. రక్తపు మడుగులో పడి ఉన్న శిరీష అక్కడిక్కడే ప్రాణాలు విడిచింది. ఇది గమనించిన గ్రామస్తులు నిందితుడిని పట్టుకొని చెట్టుకు కట్టేసి చితకబాదారు. అనంతరం పోలీసులకు సమాచారం ఇచ్చారు. స్పృహ కోల్పోయిన చరణ్‌ను ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స చేయిస్తున్నారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు వివరాలు సేకరిస్తున్నారు. చదవండి: లంచం తీసుకుంటూ పట్టుబడ్డ జగిత్యాల ఎస్సై.. వెక్కి వెక్కి ఏడుస్తూ -
విడాకుల వివాదం.. మోడల్ దారుణ హత్య
బీరూట్: లెబనాన్‌కు చెందిన జైనా కంజో చాలా అందంగా ఉంటుంది. బ్యూటీ క్వీన్. ఇంతటి అందాల రాశిని చూసిన మోడలింగ్ ఏజెన్సీలు, ఇండస్ట్రీ ప్రముఖలు ఊరుకోరు కదా.. పిలిచి మరి అవకాశాలు ఇచ్చారు. ఇప్పుడిప్పుడే తనకంటూ ఓ గుర్తింపు లభిస్తోంది. మోడల్‌గా ఎదుగుతున్న సమయంలోనే ఇంట్లో వాళ్లు పెళ్లి చేశారు. వివాహం అయ్యి ఇంకా ఏడాది కూడా గడవలేదు. అన్యోన్యంగా సాగాల్సిన వారి జీవితంలో ఘర్షణలు మొదలయ్యాయి. తనకంటూ ఓ గుర్తింపు తెచ్చుకోవాలి.. మోడల్‌గా రాణించాలనేది జైనా ఆశ. కానీ ఆమె భర్త మాత్రం అందరి భార్యల్లాగే జైనా కూడా ఇంటి పట్టునే ఉండాలని.. కుటుంబాన్ని చూసుకోవాలని భావించాడు. దాంతో ఇద్దరి మధ్య నిత్యం గొడవలే. ఇక లాభం లేదునుకుని జైనా భర్త నుంచి విడిపోవాలని భావించింది. కానీ విడాకులు తీసుకోవడం భర్తకు ఇష్టం లేదు. ఈ క్రమంలో ఈ నెల 7వ తారీఖున ఇద్దరి మధ్య వివాదం మరింత ముదిరింది. ఆగ్రహంతో ఊగిపోయిన జైనా భర్త ఆమె గొంతు కోసి హత్య చేశాడు. ఆ తర్వత భయంతో అక్కడి నుంచి టర్కీ పారిపోయాడు. జైనాను హత్య చేసిన తర్వాత ఆమె భర్త తాను చేసిన దారుణం గురించి సోదరితో చెప్పాడు. వారి మధ్య జరిగిన ఫోన్ కాల్ రికార్డింగ్ మీడియాకు చిక్కింది. దీని ఆధారంగా పోలీసులు జైనా భర్త మీద కేసు నమోదు చేశారు. ఇక ఈ ఆడియో క్లిప్పింగ్‌లో జైనా భర్త తన సోదరిని ఉద్దేశించి.. ‘‘నన్ను ఏమైనా అడుగు. నేను కావాలని తనను చంపలేదు. ఆమె చనిపోవాలని నేను కోరుకోలేదు. ఆమె ఏడుస్తుండటంతో నా చేతిని ఆమె నోటికి అడ్డం పెట్టాను. ఏడవద్దని చెప్పాను. కానీ ఆమె నా మాట వినలేదు.. నాతో గొడవపడాలని చూసింది. తెల్లవారుతున్నా ఆమె ఏడుపు ఆపలేదు. నేను ఆమెను చంపానా’’ అని ఆడిగినట్లు తెలిసింది. ఇక మరో దారుణమైన విషయం ఏంటంటే.. కొద్ది రోజుల క్రితమే జైనా తన భర్త మీద పోలీసులకు ఫిర్యాదు చేసింది. తనను హింసిస్తున్నాడని.. భర్త నుంచి తనకు రక్షణ కల్పించాల్సిందిగా కోరింది. ఇది జరిగిన కొద్ది రోజుల వ్యవధిలోనే ఆమె భర్త చేతిలో దారుణ హత్యకు గురయ్యింది. ఇక జైనా హత్యకు సంబంధించి ఆమె అభిమానులు పోలీసులు తీరు మీద ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఆమెకి న్యాయం చేయాలని డిమాండ్ చేస్తున్నారు. చదవండి: అందానికి కొలతలెందుకు? 57వ ఏట మళ్లీ ప్రేమను అనుభూతి చెందాను -
దారుణం: టీవీ పెట్టమని అడిగినందుకు..
చెన్నై : ఎనిమిదేళ్ల చిన్నారి. ఆడుతూ, పాడుతూ గడిపే జీవితం. ఓ రోజు పక్కింటి వారి ఇంటికి వెళ్లడం ఆ పాప పాలిట మృత్యుపాశంగా మారింది. వివరాల్లోకెళితే.. మూడో తరగతి చదువుతున్న చిన్నారి తన తల్లితోపాటు చెన్నైలోని తూటికోరిన్ జిల్లాలో నివసిస్తోంది. ఇంట్లో టీవీ లేకపోవడంతో అప్పుడప్పుడు పక్కన వాళ్ల ఇంట్లోకి వెళ్లి చూసేది. ఇలా బుధవారం కూడా బాలిక పొరిగింటి వారి ఇంట్లోకి టీవీ పెట్టమని ఆశగా అడిగింది. అయితే అప్పటికే ఆ ఇంటి యాజమాని తన తండ్రితో ఏదో విషయంలో గొడవ పడుతున్నాడు. అదే సమయంలో పాప టీవీ పెట్టమని అడగంతో ఆ కోపాన్ని చిన్నారిపై చూపిస్తూ దారుణానికి ఒడిగట్టాడు. (పుట్టినరోజు డ్రెస్ కోసం బాలుడి ఆత్మహత్య) బాలిక గొంతు కోసి చంపి ఆమె శవాన్ని ప్లాసిక్ డ్రమ్‌లో కప్పి మూత పెట్టాడు. అనంతరం తన ఇంటి సమీపంలోని వంతెన వద్దకు వెళ్లి మృతదేహాన్ని నీటిలో పడేశాడు. మృతదేహాన్ని నీటిలో పడేయం చూసిన ఓ వ్యక్తి వెంటనే పోలీసులకు సమాచారం అందించాడు. సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు నీటి నుంచి చిన్నారి మృతదేహాన్ని తీసి పోస్టుమార్టానికి తరలించారు. అనంతరం నిందితుడిని అతనికి సాయం చేసిన స్నేహితుడిని అరెస్టు చేసినట్లు పోలీసులు తెలిపాను. పోక్సో చట్టం కింద నేరస్తునిపై కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. అయితే బాలికపై అత్యాచారం జరిగిందా అనే కోణంలో పోస్టుమార్టం నివేదిక కోసం ఎదురు చూస్తున్నట్లు పోలీసులు పేర్కొన్నారు. (అజయ్, శ్రావణిల ప్రేమ విషాదాంతం) -
ప్రేమించిన వాడితో పారిపోతుందని తెలిసి..
ముంబై : తన ఇష్టానికి వ్యతిరేకంగా ఓ యువకుడిని ప్రేమించి పెళ్లి చేసుకుంటుందనే కోపంతో కన్న తల్లే కూతురిని కడతేర్చింది. తన మాట వినకుండా ప్రియుడితో పారిపోవడానికి ప్రయత్నిస్తుందని తెలిసి గొంతు నులిమి హతమార్చింది. పరువు హత్యలు రోజూరోజూకి పెరిగిపోతున్నాయనడానికి ఈ సంఘటన తాజా ఉదాహరణగా నిలిచింది. ఈ దారుణ ఘటన ఆదివారం ముంబైలో వెలుగు చూసింది. వివరాలు.. పి. వఘేలా(40) అనే మహిళ తన కూతురు నిర్మలా ఆశోక్ వఘేలా(23)తో కలిసి ముంబై నగరంలో జీవిస్తోంది. ఈ క్రమంలో నిర్మలా ఓ వ్యక్తితో ప్రేమలో పడింది. అయితే ఎంతో ప్రేమగా పెంచుకున్న తన కూతురు ముక్కు మొహం తెలియని వ్యక్తిని ఇష్టపడుతోందని తెలియడంతో ఇలాంటివి మానుకోమని తల్లి అనేకసార్లు ఆమెను హెచ్చరించింది. అయినా కూతురు ప్రవర్తనలో మార్పు రాకపోవడంతో ఆమెపై కోపాన్ని పెంచుకొంది. ఇదిలా ఉండగా ఆదివారం ప్రేమించిన వ్యక్తితో పారిపోవడానికి నిర్మల సిద్ధమైంది. ఈ విషయం తల్లికి తెలియడంతో కూతురుతో వాగ్వివాదానికి దిగింది. అనంతరం తన మాట వినకుండా కూతురు పారిపోతుందన్న కోపంతో చున్నీతో గొంతు నులిమింది. అనంతరం పోలీసుల ఎదుట లొంగిపోయి నేరాన్ని అంగీకరించింది. ఈ విషయంపై కేసు నమోదు చేసిన పోలీసులు విచారణ జరుపుతున్నారు. -
జాగింగ్ కు వెళ్లిన మహిళ హత్య
న్యూయార్క్: జాగింగ్ కు వెళ్లిన మహిళ హత్యకు గురైన ఘటన న్యూయార్క్ లో సంచలనం రేపింది. కత్రినా వెట్రానో(30) అనే మహిళ మార్క్ లాండ్ పార్క్ లో మంగళవారం హత్యకు గురైంది. ఆమెను గొంతు పిసికి హత్య చేసినట్టు పోలీసులు గుర్తించారు. ఆమెపై అత్యాచారం జరిగిందని పోలీసులు అనుమానిస్తున్నారు. హోవార్డ్ బీచ్ కు సమీపంలో నివాసముంటున్న కత్రినా వెట్రానో మంగళవారం సాయంత్రం 5 గంటల ప్రాంతంలో జాగింగ్ కు వెళ్లింది. రోజూ తండ్రి ఫిలిప్ తో పాటు ఆమె జాగింగ్ కు వెళ్లేంది. వెన్నునొప్పిగా కారణంగా ఆయన జాగింగ్ కు వెళ్లలేదు. ఒంటరిగా వెళ్లొద్దని తండ్రి వారించినా ఆమె జాగింగ్ కు వెళ్లింది. ఫోన్ కాల్‌కు స్పందించకపోవడం, చాలాసేపైనా ఇంటికి కూతురు ఇంటికి తిరిగి రాకపోవడంతో ఆయన 911 నంబర్ కు ఫోన్ చేశారు. పార్క్ లో పొదలపాటున ఆమె మృతదేహాన్ని పోలీసులు కొనుగొన్నారు. హంతకులను గుర్తించేందుకు సీసీ కెమెరా వీడియోలను పరిశీలిస్తున్నారు. ఫోరెన్సిక్ ఆధారాలు కూడా సేకరించారు. -
గుర్తుతెలియని వ్యక్తి ఆత్మహత్య
వెల్దుర్తి: గుంటూరు జిల్లా వెల్దుర్తి మండలం వజ్రాలపాడు తండాలోని రంగమూడి కుంట వద్ద ఓ గుర్తుతెలియని వ్యక్తి ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. స్థానికులు గమనించి ఈ విషయాన్ని పోలీసులకు తెలియజేశారు. ఆత్మహత్యకు పాల్పడిన వ్యక్తి వయసు సుమారు 40 నుండి 50 సంవత్సరాల మధ్య ఉన్నట్లు తెలుస్తోంది. మృత దేహాన్ని పరిశీలించిన పోలీసులు.. మూడు రోజుల క్రితమే ఆత్మహత్యకు పాల్పడి ఉండవచ్చునని భావిస్తున్నారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. -
మహిళపై అత్యాచారం, హత్య
కాటారం(కరీంనగర్ జిల్లా): కాటారం మండలం చింతకానిలో దారుణం చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన పోశయ్య(50) సొంత వదినపైనే తాగిన మైకంలో శనివారం అర్ధరాత్రి అత్యాచారం చేశాడు. అనంతరం గొంతు నులిమి హతమార్చాడు. మృతురాలికి భర్త లేడు. నిందితుడు పోశయ్యను ఆదివారం పోలీసులు అరెస్ట్ చేసి స్టేషన్‌కు తరలించారు.