
ప్రతీకాత్మక చిత్రం
ముంబై : తన ఇష్టానికి వ్యతిరేకంగా ఓ యువకుడిని ప్రేమించి పెళ్లి చేసుకుంటుందనే కోపంతో కన్న తల్లే కూతురిని కడతేర్చింది. తన మాట వినకుండా ప్రియుడితో పారిపోవడానికి ప్రయత్నిస్తుందని తెలిసి గొంతు నులిమి హతమార్చింది. పరువు హత్యలు రోజూరోజూకి పెరిగిపోతున్నాయనడానికి ఈ సంఘటన తాజా ఉదాహరణగా నిలిచింది. ఈ దారుణ ఘటన ఆదివారం ముంబైలో వెలుగు చూసింది. వివరాలు.. పి. వఘేలా(40) అనే మహిళ తన కూతురు నిర్మలా ఆశోక్ వఘేలా(23)తో కలిసి ముంబై నగరంలో జీవిస్తోంది.
ఈ క్రమంలో నిర్మలా ఓ వ్యక్తితో ప్రేమలో పడింది. అయితే ఎంతో ప్రేమగా పెంచుకున్న తన కూతురు ముక్కు మొహం తెలియని వ్యక్తిని ఇష్టపడుతోందని తెలియడంతో ఇలాంటివి మానుకోమని తల్లి అనేకసార్లు ఆమెను హెచ్చరించింది. అయినా కూతురు ప్రవర్తనలో మార్పు రాకపోవడంతో ఆమెపై కోపాన్ని పెంచుకొంది. ఇదిలా ఉండగా ఆదివారం ప్రేమించిన వ్యక్తితో పారిపోవడానికి నిర్మల సిద్ధమైంది. ఈ విషయం తల్లికి తెలియడంతో కూతురుతో వాగ్వివాదానికి దిగింది. అనంతరం తన మాట వినకుండా కూతురు పారిపోతుందన్న కోపంతో చున్నీతో గొంతు నులిమింది. అనంతరం పోలీసుల ఎదుట లొంగిపోయి నేరాన్ని అంగీకరించింది. ఈ విషయంపై కేసు నమోదు చేసిన పోలీసులు విచారణ జరుపుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment