గుర్తు తెలియని వ్యక్తి ఆత్మహత్య
Published Sun, Dec 4 2016 12:11 AM | Last Updated on Tue, Nov 6 2018 7:56 PM
ఆదోని టౌన్: గుర్తు తెలియని యువకుడు రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్న సంఘటన శనివారం ఆదోని రైల్వే స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. రైల్వే ఎస్ఐ సుబ్బరాయుడు తెలిపిన వివరాల మేరకు.. ఆదోని–నగరూరు రైల్వే స్టేషన్ మధ్య 492/34 కి.మీ. రాయివద్ద గుర్తు తెలియని వ్యక్తి మృతదేహాన్ని స్థానికులు గుర్తించి పోలీసులకు సమాచారం ఇచ్చారు. శరీరం ఛిద్రమైంది. బ్లూ కలర్ షర్టు, జీన్స్ ప్యాంట్, నల్లని కట్ బనియన్, గొంతులో శిలువ ధరించి ఉన్నాడు. కుడిచేతిపై శిలువను పచ్చబొట్టు ఉంది. అయితే పరిసర ప్రాంతాలకు చెందిన వ్యక్తి ఉండొచ్చని స్థానికులు అనిమానిస్తున్నారు. పంచనామా నిర్వహించి శవాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆదోని ప్రభుత్వాసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ తెలిపారు.
Advertisement
Advertisement