గుర్తు తెలియని మహిళ మృతి
విజయవాడ(ఆటోనగర్):
రామవరప్పాడు రింగు వద్ద రోడ్డు దాటుతుండగా టిప్పర్ ఢీకొనటం తో గుర్తు తెలియని మహిళ మృతిచెందింది. పోలీసుల వివరాలు...సుమారు 60 ఏళ్ల వయస్సు ఉన్న గుర్తు తెలియని మహిళ రామవరప్పాడు రింగు వద్ద రోడ్డు దాటుతుం డగా టిప్పర్ ఢీకొంది. తలకు బలమైన గాయం తగలటంతో ఆమెను ప్రభుత్వాస్పత్రికి తరలించారు. ఆమె అక్కడ మృతి చెం దింది. పచ్చరంగు చీర, పసుపు జాకెట్టు, మెడలో తెలుపు ఎరుపు పూసల దండ వేసుకుందని, చేతులకు బంగారు రంగు గాజులున్నాయని, ఆచూకీ తెలిసిన వారు పటమట పోలీసుస్టేçÙన్‌లో సంప్రదించాలని ఎస్‌ఐ తెలిపారు.