అపస్మారక స్థితిలోని మహిళ ఆచూకీ లభ్యం | unknown women details | Sakshi
Sakshi News home page

అపస్మారక స్థితిలోని మహిళ ఆచూకీ లభ్యం

Published Sat, Oct 8 2016 10:32 PM | Last Updated on Sat, Aug 25 2018 4:51 PM

unknown women details

రాజమహేంద్రవరం క్రైం : 
అపస్మారక స్థితిలో ఉన్న మహిళ ఆచూకీ లభించింది. మీడియా లో వచ్చిన కథనాల ఆధారంగా ఆమె అల్లు డు పట్టాభి రామయ్య, ఆడపడుచు ఝాన్సీ, ఇతర బంధువులు శనివారం రాజమహేంద్రవరం ప్రభుత్వ ఆస్పత్రికి వచ్చారు. వారు తెలిపిన వివరాల మేరకు ఆలమూరు మండ లం పెద్దపళ్ల గ్రామానికి చెందిన చిలుకూరి భవాని గత నెల 30వ మండపేట వెళుతున్నానని ఇంట్లో చెప్పి బయటకు వ చ్చింది. అప్పటి నుంచి ఆమె ఆచూకీ లభి ంచలేదు. ఆమె బంధువుల ఫిర్యాదు మేరకు ఆల మూరు పోలీస్‌స్టేçÙన్‌లో మిస్సింగ్‌ కేసు నమోదైంది. ఈ నేపథ్యంలో 8 రోజుల తరు వాత శుక్రవారం రాజమహేంద్రవరంలోని రైల్వేక్వార్టర్‌లో చేతులు కట్టేసి అపస్మారక స్థితిలో ఉన్న ఆమెను స్వీపర్లు గుర్తించారు. 
 
పలు అనుమానాలు
చిలుకూరి భవాని ఈ ఎనిమిది రోజులూ ఎక్కడ ఉంది, రాజమహేంద్రవరం ఎందుకు వచ్చిందనే విషయంపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. రాజమహేంద్రవరంలోని రైల్వేస్టేçÙ¯Œæకు ఎదురుగా ఉన్న ఓ జ్యోతి షుడి ఇంట్లో గతంలో ఆమె వంటపని చేసిం ది. అలాగే వడ్డీవ్యాపారం కూడా నిర్వహించే ంది. 30న ఇంటినుంచి వచ్చేటప్పుడు.. ఆలమూరులో ఇంటి నిర్మాణానికి డబ్బులు తీసుకువస్తానని తన కుమార్తెకు చెప్పింది. అయితే.. ఆమె రాజమహేంద్రవరంలో ఎవ రి ఇంటికి వచ్చింది,  డబ్బులు ఇవ్వాలని అడగ్గా ఆమె కు బాకీ ఉన్నవారే నిర్భందించారా, ఇంకా వేరే కారణాలేమైనా ఉన్నయా అనే విషయాలపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.  
పరిస్థితి విషమం : భవాని చేతులు కట్టివేసి, నోట్లో గు డ్డలు కుక్కడంతో పరిస్థితి విషమంగా మారింది. ఒకటికన్నా ఎక్కువ రోజులు ఈ పరిస్థితిలో ఉండడంతో అవయవాలు పూర్తిగా దెబ్బతిన్నాయి. కిడ్ని సక్రమంగా పని చేయక కోమాలోకి వెళ్లిపోయింది. శనివారం ఆమె ఆరోగ్యం విషమించడంతో రాజమహేంద్రవరం ప్రభుత్వ హాస్పటల్‌ సూపరింటెండెంట్‌ రమేష్‌ కిషోర్‌ సూచన మేరకు కాకినాడ ఆస్పత్రికి తరలించారు. బాధితురాలి బం««దlువులను అర్బన్‌ ఎస్పీ బి.రాజ కుమారి, సౌత్‌జోన్‌ డీఎస్పీ నారాయణరావు తదితరులు విచారించారు. 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement