
నేత్రపర్వంగా ఉట్లపరుష
బెళుగుప్ప (ఉరవకొండ) : మండల కేంద్రం బెళుగుప్పలోని శాంతిధామంలో అవధూత ఎర్రితాతస్వామి ఆరాధనోత్సవాలను పురస్కరించుకుని మంగళవారం ఉట్లపరుష నేతపర్వంగా జరిగింది. ఉట్లమాను ఎక్కేందుకు యువకులు పోటాపోటీగా తలపడ్డారు. బీసీ కాలనీకి చెందిన నరేష్ ఉట్లమానును ఎక్కి స్వామివారి ప్రసాదంగా ఉంచిన వివిధ రకాల పండ్లు, నారికేళాన్ని అందుకున్నాడు. ముగింపు ఉత్సవాల్లో భాగంగా ఎర్రితాతస్వామిని పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొని దర్శించుకున్నారు. గ్రామంలో రాత్రి ప్రదర్శించిన ‘సప్తమాంకములు’ అనే నాటకం అందర్నీ ఆకట్టుకుంది. అవాంఛనీయ సంఘటనలను చోటు చేసుకోకుండా ఎస్‌ఐ నాగస్వామి సిబ్బందితో గట్టి బందోబస్తును ఏర్పాటు చేశారు.