utla parusha
-
వైభవంగా ఉట్ల పరుష
ఉరవకొండ: ప్రసిద్ధ పుణ్యక్షేత్రం పెన్నహోబిలం శ్రీలక్ష్మీనృసింహస్వామి ఆలయంలో శుక్రవారం ఉట్ల పరుస వైభవంగా జరిగింది. ఈఓ అక్కిరెడ్డి, ప్రధాన అర్చకులు ద్వారకనాథచార్యులు ఆధ్వర్యంలో శ్రీవారి ఉత్సవ మూర్తులను ఆమిద్యాల పెన్నోబులేసుడి ఆలయం నుంచి పెన్నహోబిలానికి తీసుకొచ్చారు. అనంతరం స్వామి వారికి అభిషేకం, మహామంగళహారతి, కుంకమార్చన నిర్వహించారు. అనంతరం శ్రీదేవి, భూదేవి సమేత శ్రీలక్ష్మినృసింహున్ని ప్రత్యేక పల్లకీలో ఆలయ పురవీధుల్లో ఊరేగించారు. అనంతరం యువకులు ఉట్లపరుసలో పాల్గొని, ఉట్టిని పగులగొట్టారు. -
నేత్రపర్వంగా ఉట్లపరుష
బెళుగుప్ప (ఉరవకొండ) : మండల కేంద్రం బెళుగుప్పలోని శాంతిధామంలో అవధూత ఎర్రితాతస్వామి ఆరాధనోత్సవాలను పురస్కరించుకుని మంగళవారం ఉట్లపరుష నేతపర్వంగా జరిగింది. ఉట్లమాను ఎక్కేందుకు యువకులు పోటాపోటీగా తలపడ్డారు. బీసీ కాలనీకి చెందిన నరేష్ ఉట్లమానును ఎక్కి స్వామివారి ప్రసాదంగా ఉంచిన వివిధ రకాల పండ్లు, నారికేళాన్ని అందుకున్నాడు. ముగింపు ఉత్సవాల్లో భాగంగా ఎర్రితాతస్వామిని పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొని దర్శించుకున్నారు. గ్రామంలో రాత్రి ప్రదర్శించిన ‘సప్తమాంకములు’ అనే నాటకం అందర్నీ ఆకట్టుకుంది. అవాంఛనీయ సంఘటనలను చోటు చేసుకోకుండా ఎస్ఐ నాగస్వామి సిబ్బందితో గట్టి బందోబస్తును ఏర్పాటు చేశారు. -
కనువిందుగా ఉట్ల పరుష
రొద్దం : మండల కేంద్రంలోని పెన్నానది ఒడ్డున వెలసిన గ్రామదేవత రొద్దకాంబదేవి 10వ జాతరోత్సవం ముగింపు సందర్భంగా ఆదివారం ఏర్పాటు చేసిన ఉట్లపరుష కనువిందుగా సాగింది. ఉదయం అమ్మవారికి అభిషేకాలు, రుద్రపాద శివునికి అలంకార పూజలు, ఆకుపూజ అలంకరణ చేశారు. సాయంత్రం 5 గంటల నుంచి తరలివచ్చిన అశేష జన సందోహం నడుమ ఉట్లపరుషను ఎంతో వైభవంగా నిర్వహించారు. ఉట్లమాను ఎక్కడానికి యువకులు పెద్ద ఎత్తున పోటీ పడ్డారు. చివరకు రొద్దం కంపల్లి గ్రామానికి చెందిన అంగజాల వంశీయుడు అంగజాల నరసప్ప కుమారుడు రాజేంద్ర అనే యువకుడు ఉట్లమాను ఎక్కాడు. ఆయనను డప్పు వాయిద్యాలతో గ్రామంలో ఊరేగించారు. ఈ వేడుకను తిలకించడానికి వివిధ గ్రామాల నుంచి ప్రజలు వేలాదిగా వచ్చారు. జాతరలో అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా ఎస్ఐ మున్నీర్అహ్మద్ గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు. -
ఘనంగా ఉట్ల పరుష
గోరంట్ల (పెనుకొండ) : మండలంలోని పాల సముద్రంలో శుక్రవారం ఉట్టపరుష ఘనంగా జరిగింది. ఉట్లమాను ఎక్కడానికి యువకులు పోటీపడ్డారు. ఈ కార్యక్రమాన్ని తిలకిండానికి చుట్టు పక్కల గ్రామాల ప్రజలు భారీ ఎత్తున తరలి వచ్చారు. -
వైభవంగా ఎర్రితాతస్వామి ఉట్ల పరుష
రాప్తాడు : మండల పరిధిలోని అయ్యవారిపల్లి గ్రామంలో మూడు రోజులుగా నిర్వహిస్తున్న ఎర్రితాత స్వామి ఉట్లపరుష సోమవారంతో ముగిసింది. ఆలయంలో తెల్లవారుజామునే ఎర్రితాత స్వామికి ప్రత్యేక పూజలు చేశారు. పరుషకు కనగానపల్లి, ఆత్మకూరు, అనంతపురం, ధర్మవరం తదితర మండలాల నుంచే కాక జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి వేలాది మంది భక్తులు తరలివచ్చి, మొక్కులను తీర్చుకున్నారు. ఆలయం సమీపంలో ఏర్పాటు చేసిన దుకాణాల వద్ద సందడి నెలకొంది. భక్తుల రద్దీ ఎక్కువ కావడంతో క్యూ లైన్లు ఏర్పాటు చేశారు. ప్రత్యేక పూజలు : ఎర్రితాత స్వామి ఉట్లపరుషను అయ్యవారిపల్లి గ్రామస్తులు, భక్తులు ఆలయంలో వినాయకుడు, శ్రీరాముడు, ఎర్రితాతస్వామి, గోటుకూరుప్ప స్వాములకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. -
ఉత్సాహంగా ఉట్లోత్సవం
గోరంట్ల : తొలి ఏకాదశి పర్వదిన వేడుకల్లో భాగంగా మండలంలోని మల్లాపల్లి గ్రామంలో ఉట్ల పరుషను బుధవారం ఘనంగా నిర్వహించారు. వందలాది మంది ప్రజలు ఉట్ల పరుషకు హాజరై ఉట్లను కొట్టడం, ఉట్ల మాను ఎక్కే దృశ్యాలు కనులవిందు కలిగించాయి. ఈ సందర్భంగా కదిరి– హిందూపురం ప్రధాన రహదారి కిరువైపులా ఏర్పాటు చేసిన వివిధ దుకాణాలలో ఆట వస్తువులు, గాజుల అంగళ్లు కొనుగోలు దారులతో కిటకిటలాడాయి. ఈ కార్యక్రమంలో యువకులతో పాటు మల్లాపల్లి పంచాయతీకి చెందిన వసంతరావు, దేవనరసింహప్పలు ఊరేగింపుగా వచ్చి, స్థానిక ఆంజనేయస్వామి ఆలయంలో ప్రత్యేక పూజల అనంతరం ఉట్ల పరుషను నిర్వహించారు.