వర్షాల కోసం మద్దిలో వరుణ జపం | varana japam in maddi | Sakshi
Sakshi News home page

వర్షాల కోసం మద్దిలో వరుణ జపం

Published Fri, Aug 26 2016 10:01 PM | Last Updated on Mon, Jul 29 2019 6:07 PM

వర్షాల కోసం మద్దిలో వరుణ జపం - Sakshi

వర్షాల కోసం మద్దిలో వరుణ జపం

జంగారెడ్డిగూడెం రూరల్‌ : వర్షాలు సమృద్ధిగా కురిసి పాడిపంటలు సుభిక్షంగా ఉండాలని కోరుతూ జంగారెడ్డిగూడెం మండలం గుర్వాయిగూడెం మద్ది ఆంజనేయస్వామి వారి ఆలయంలో శుక్రవారం వరుణ జప పూజలు నిర్వహించారు. ఈ నెల 28 వరకు మూడు రోజుల పాటు వరుణ సూక్త పారాయణం, వారణానువాక జపం, రుద్రహోమాలు, సహస్ర ఘటాభిషేకం వంటి పూజా కార్యక్రమాలు నిర్వహిస్తామని ఆలయ కార్యనిర్వాహణాధికారి పెన్మెత్స విశ్వనాథరాజు తెలిపారు. దేవాదాయ శాఖ ఆదేశాల మేరకు ఈ కార్యక్రమాలు నిర్వహిస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో ఆలయ చైర్మన్‌ ఇందుకూరి రంగరాజు పాల్గొన్నారు. 
 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement