
వరవరరావు సంచలన వ్యాఖ్యలు
వరంగల్: విప్లవ కవి వరవరరావు వరంగల్ ఎన్ కౌంటర్ పై సంచలన వ్యాఖ్యలు చేశారు. శృతిని లైంగికంగా హింసించి, యాసిడ్ పోసి పోలీసులు హతమార్చారని ఆయన ఆరోపించారు. మైనింగ్ మాఫియా కోసమే ఈ దారుణానికి పాల్పడ్డారని, బంగారు తెలంగాణ అంటే ఇదేనా అని ప్రశ్నించారు. చంద్రబాబు తరహాలో కేసీఆర్ రాజ్యహింసకు పాల్పడుతున్నారని ధ్వజమెత్తారు. ఎన్ కౌంటర్ లో మృతి చెందిన మావోయిస్టుల కుటుంబాలను బుధవారం ఆయన పరామర్శించారు.
వరంగల్ జిల్లా గోవిందరావుపేట-తాడ్వాయి అడవుల్లో మంగళవారం జరిగిన ఎన్ కౌంటర్ లో తంగెళ్ల శృతి(23) అలియాస్ మహిత, మణికంటి విద్యాసాగర్ రెడ్డి(27) అలియాస్ సాగర్ మృతి చెందారు. శ్రుతి హన్మకొండలోని తాళ్ల పద్మావతి ఇంజనీరింగ్ కాలేజీలో బీటెక్ (ఈసీఈ) పూర్తిచేసి హైదరాబాద్ నల్ల మల్లారెడ్డి ఇంజనీరింగ్ కాలేజీలో ఎంటెక్ ఫైనలియర్ చదువుతోంది.