అనంతపురం సప్తగిరి సర్కిల్ : ఎస్కే యూ వైస్ చాన్స ల ర్ రాజగోపాల్ అవి నీతిని అరికట్టాలని వైఎస్‌ఆర్ విద్యార్థి విభాగం నాయకు లు మా నవ వనరుల శాఖ మంత్రి గంటా శ్రీనివాసరావును డిమాండ్ చేశారు. శనివారం వీసీల సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరైన ఆయనకు వినతిపత్రం అందజేశారు. దీర్ఘకాలంగా ఉన్న టీచింగ్, నాన్‌టీచింగ్ పోస్టులను భర్తీ చేయాలని కోరారు. యూనివర్సిటీలో చదివే ప్రతి విద్యార్థికీ హాస్టల్ వసతి కల్పించాలని డిమాండ్ చేశారు.
ప్రతి విద్యార్థికి స్కాలర్‌షిప్ మంజూరు చేయాలన్నారు. పరిశోధక విద్యార్థులకు ఫెలోషిప్‌ను మంజూరు చేయాలన్నారు. జిల్లాలో కరువు దృష్ట్యా ఎస్కేయూలో మెస్ బిల్లులను రద్దు చేయాలని కోరారు. ఎస్కేయూను సెంట్రల్ యూనివర్సిటీగా పరిగణించాలని, ఆన్‌లైన్ ద్వారా విద్యార్థులపై భారం మోపుతున్న యంత్రాంగంపై తక్షణమే చర్యలు తీసుకోవాలని వినతిపత్రం అందజేశారు. వైఎస్సార్ విద్యార్థి విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జీవీ లింగారెడ్డి, కార్యదర్శి నరసింహారెడ్డి, క్రాంతి కిరణ్ పాల్గొన్నారు.
వీసీ అవినీతి అరికట్టాలి: వైఎస్సార్‌ఎస్‌యూ
Published Sat, Aug 6 2016 11:41 PM | Last Updated on Tue, Nov 6 2018 5:13 PM
Advertisement
Advertisement