'దేశంలో అనేక మార్పులకు ఆద్యుడు వాజ్‌పేయ్'
అమరావతి: స్వాతంత్య్ర భారతదేశంలో అనేక మార్పులకు ఆద్యుడు మాజీ ప్రధాని, భారతరత్న వాజ్‌పేయ్ అని కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు కొనియాడారు. వాజ్‌పేయ్ జన్మదినం సందర్బంగా సుపరిపాలన దినంగా కేంద్రం ప్రకటించిన నేపథ్యంలో ఆదివారం విజయవాడలో భారతీయ జనతాపార్టీ ఏర్పాటుచేసిన పలు కార్యక్రమాల్లో ఆయన పాల్గొన్నారు.
విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలో పేదలకు దుప్పట్లు పంచిపెట్టారు. అనంతరం ఏలూరు రోడ్డులో జరిగిన ఓ కార్యక్రమంలో పార్టీ కార్యకర్తలను ఉద్దేశించి ప్రసంగించారు. దేశాన్ని నెహ్రూ కుటుంబం తప్ప మరెవరూ ఐదేళ్లపాటు సుస్థిరంగా పరిపాలించలేరని ఒక రకమైన వాదన ఉన్న రోజుల్లో 23 రాజకీయ పార్టీలతో కూడిన సంకీర్ణ ప్రభుత్వంతో ఐదేళ్లపాటు సుస్థిర పాలన అందించిన ఘనత వాజ్‌పేయ్‌దేనని చెప్పారు.