venkaiya naidu
-
దేశాభివృద్ధికి చిన్నారుల సంక్షేమమే పునాది
సాక్షి, న్యూఢిల్లీ : ఆరోగ్యభారత నిర్మాణంలో భాగంగా చిన్నారులకు సరైన పౌష్టికాహారాన్ని అందించడం అత్యంత కీలకమైన అంశమని ఉపరాష్ట్రపతి ఎం.వెంకయ్యనాయుడు పేర్కొన్నారు. చిన్నారుల సంక్షేమం ద్వారానే దేశాభివద్ధికి పునాది పడుతుందని ఇందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలతో పాటు పౌర సమాజం స్వచ్ఛందంగా భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. శుక్రవారం ఉపరాష్ట్రపతి నివాసంలోని సర్దార్ వల్లభాయ్ పటేల్ సమావేశ ప్రాంగణంలో..‘స్టేట్ ఆఫ్ యంగ్ చైల్డ్ ఇన్ ఇండియా’ పుస్తకాన్ని ఆన్లైన్ వేదిక ద్వారా వెంకయ్యనాయుడు ఆవిష్కరించారు. పుస్తకంలో ప్రస్తావించిన పలు అంశాలను కూడా ఈ సందర్భంగా ఉపరాష్ట్రపతి ఉటంకించారు. ‘భారతదేశంలో 15.9 కోట్ల మంది ఆరేళ్లలోపు చిన్నారులు ఉన్నారు. ఇందులో 21 శాతం మందిలో పోషకాహారలోపం, 36శాతం మంది తక్కువ బరువుతో ఉండగా.. 38 శాతం మందికి టీకాలు అందడం లేదని కొన్ని నివేదికలు చెబుతున్నాయి. ఈ అంకెలు.. చిన్నారులతోపాటు దేశ భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని మనం మరింత కృషి చేయాల్సిన అవసరాన్ని గుర్తుచేస్తున్నాయి’ అని ఆయన పేర్కొన్నారు. (యువత సమస్యలపై ప్రభుత్వానికి నిజాయితీ లేదు) -
వ్యవసాయోత్పత్తుల ఎగుమతులు పెంచాలి
సాక్షి, ఢిల్లీ : దేశంలో వివిధ వ్యవసాయ ఉత్పత్తుల దిగుబడులతో పోలిస్తే ఎగుమతి సగటున 1 శాతం కూడా ఉండటం లేదని వాణిజ్యానికి సంబంధించిన పార్లమెంటరీ స్థాయీ సంఘం నివేదికలో వెల్లడైంది. వ్యవసాయోత్పత్తుల ఎగుమతులను ప్రోత్సహించాల్సిన తక్షణ అవసరం ఉన్నట్లు కమిటీ అభిప్రాయపడింది. అందుకోసం తీసుకోవలసిన చర్యలను వివరిస్తూ స్థాయీ సంఘం 154వ నివేదికలో ప్రభుత్వానికి సిఫార్సు చేసింది. ఈ నివేదికను స్థాయీ సంఘం చైర్మన్ వి.విజయసాయి రెడ్డి.. రాజ్యసభ చైర్మన్ ఎం. వెంకయ్యనాయుడుకు అందించారు. రైతులు యాంటిబయాటిక్స్‌ను నియంత్రిత రీతిలో వినియోగించేందుకు అవసరమైన ఎక్స్టెన్షన్ సేవలను ప్రభుత్వ పర్యవేక్షణలో రైతులకు అందుబాటులోకి తీసుకురావాలని కమిటీ సిఫార్సు చేసింది. మత్స్య ఉత్పాదనల నాణ్యత, దిగుబడులే లక్ష్యంగా పరిశోధన, అభివృద్ధి చేపట్టాల్సిందిగా పేర్కొంది. దేశంలో ఏటా 800 మిలియన్ కిలోల పొగాకు ఉత్పత్తి అవుతోంది. ఆంధ్రప్రదేశ్, కర్నాటక పొగాకు సాగులో దేశంలోనే అగ్రస్థానంలో ఉన్నాయి. పొగాకు ఉత్పాదనల ద్వారా ఏటా (2018-19 గణాంకాల ప్రకారం) సుమారు 6 వేల కోట్ల రూపాయల విదేశీ మారక ద్రవ్యం ఆర్జించడం జరుగుతోంది. కానీ పొగాకు సాగుకు మాత్రం తగినంత ప్రోత్సాహం అందడం లేదని కమిటీ అభిప్రాయపడింది. (ఆర్బీఐ పేరుతో కాలయాపన : సుప్రీం ఆగ్రహం) పొగాకు సాగులో ఎఫ్‌డీఐని అనుమతించాలి 2017లో ప్రకటించిన ఎఫ్‌డీఏ విధానం ద్వారా కాఫీ, టీ, రబ్బర్, యాలకులు వంటి ప్లాంటేషన్ పంటల సాగులో 100 శాతం విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులకు అవకాశం కల్పించారు. కానీ పొగాకు పంటకు ఆ వెసులుబాటు లేదు. కాబట్టి పొగాకు సాగులో కూడా ఎఫ్‌డీఐకి అనుమతించాలని కమిటీ సిఫార్సు చేసింది. అయితే ఎఫ్‌డీఐ ద్వారా సాగు చేసే పొగాకును ఆక్షన్ ప్లాట్‌ఫామ్స్ ద్వారా మాత్రమే మార్కెట్ చేయాలన్న నిబంధన ఉండాలని సిఫార్సుల్లో పేర్కొంది. సిగరెట్ల అమ్మకాలపై ఆర్థిక మంత్రిత్వ శాఖ 1 శాతం సుంకం విధించి ఆ మొత్తాన్ని పొగాకు మార్కెట్ స్థిరీకరణ కోసం వినియోగించాలన్న టుబాకో బోర్డు సూచనను కమిటీ ప్రశంసిస్తూ ఈ దిశగా చర్యలు తీసుకోవలసిందిగా వాణిజ్య మంత్రిత్వ శాఖకు సిఫార్సు చేసినట్లు విజయసాయిరెడ్డి తెలిపారు. దీని వలన మార్కెట్ సంక్షోభ పరిస్థితులలో రైతుల ఉత్పత్తులకు న్యాయమైన ధర లభిస్తుందని ఆయన చెప్పారు. (నా జీవితంలో మర్చిపోలేని ఘటన..) -
‘మూసీ ప్రక్షాళనపై ప్రభుత్వానికి ఆదేశాలు ఇవ్వండి’
న్యూఢిల్లీ: తెలంగాణ గంగ మూసీ నదిని పరిరక్షించాలని నల్గొండ ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడికి విజ్ఞప్తి చేశారు. ఆయన బుధవారం ఉపరాష్ట్రపతితో భేటీ అయ్యారు. భేటీ అనంతరం కోమటిరెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. కాలుష్యంతో మూసీనది ఉనికి ప్రశ్నార్థకంగా మరిందని తెలిపారు. ఫార్మా కంపెనీలు, డ్రైనేజీ నీరుతో భూగర్భ జాలాలు కలుషితమవుతున్నాయని ఉపరాష్ట్రపతి దృష్టికి తీసుకువెళ్లామన్నారు. మూసీ పరివాహక ప్రాంతాల్లో 300 నుంచి 500 ఫీట్ల లోతు వరకు భూగర్భ జలాలు కలుషితమవుతున్నాయని ఆయన పేర్కొన్నారు. ఆ నీటితో పండిన పంటలు తినడం వల్ల జనాలు అనారోగ్యం పాలవుతున్నారని చెప్పారు. మూసీ నీరు తాగడం వల్ల పశువులు మరణిస్తున్నాయని.. నమామి గంగ తరహాలో మూసీ ప్రక్షాళన చేపట్టాలని ఉపరాష్ట్రపతిని వెంకయ్యనాయుడిని కోరినట్లు కోమటిరెడ్డి వెంకటరెడ్డి తెలిపారు. ఈ విషయాన్ని పార్లమెంటు జిరో ఆవర్‌లో లెవనెత్తినా కేంద్రం స్పందించలేదన్నారు. మూసీ ప్రక్షాళనపై కేంద్ర, రాష్ట ప్రభుత్వాలకు ఆదేశాలు జారి చేయాలని వెంకయ్యనాయుడికి విజ్ఞప్తి చేశామన్నారు. ట్రిట్మెంట్ ప్లాంట్ల ఏర్పాటు, విరివిగా చెట్ల పెంపకం, పరిశ్రమ వ్యర్థాల కట్టడి ద్వారా మూసీని పరిరక్షించాలని కోమటిరెడ్డి వెంకటరెడ్డి తెలిపారు. -
మోదీ, షా కృష్ణార్జునులు: సూపర్ స్టార్
సాక్షి, చెన్నై: జమ్మూ కశ్మీర్‌కు స్వయం ప్రతిపత్తి హోదా కల్పిస్తున్న ఆర్టికల్ 370ని రద్దు చేయడంపై సూపర్ స్టార్ రజనీకాంత్ స్పందించారు. ఆర్టికల్ 370ని రద్దు చేయడం భారత్‌కు, కశ్మీరీ ప్రజలకు శుభపరిణామం అన్నారు. అంతేకాకుండా ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా కృష్ణార్జునులు అంటూ పొగడ్తలతో ముంచెత్తారు. కశ్మీర్ వ్యవహారంలో వ్యూహాత్మకంగా వ్యవహరించారని వారిద్దరికీ రజనీ శుభాకాంక్షలు తెలిపారు. ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు రెండేళ్ల ప్రస్థానంపై లిజనింగ్ లెర్నింగ్ లీడింగ్ పేరుతో పుస్తకం రాసిన విషయం తెలిసిందే. చెన్నైలోని కలైవనర్ ఆరంగం వేదికగా ఆదివారం పుస్తకావిష్కరణ కార్యక్రమం జరిగింది. వెంకయ్య నిర్వహించిన 330 ప్రజాకార్యక్రమాలతో పుస్తకాన్ని ప్రచురించారు. పుస్తకావిష్కరణ సందర్భంగా రజనీకాంత్ మాట్లాడుతూ.. కశ్మీర్‌పై కేంద్ర ప్రభుత్వం మంచి నిర్ణయం తీసుకుందని అభిప్రాయపడ్డారు. వెంకయ్య గొప్ప ఆధ్యాత్మికవేత్త అని, అనుకోకుండా రాజకీయాల్లోకి వచ్చి ఉన్నత స్థాయికి ఎదిగారని కొనియాడారు. ఈ కార్యక్రమంలో కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా, కేంద్ర మంత్రి ప్రకాశ్ జావడేకర్, తమిళనాడు సీఎం సీఎం పళని స్వామి తదితరులు పాల్గొన్నారు. -
కొత్తగా ఎంపికైన ఎంపీలకు అభినందనలు
ఢిల్లీ: కొత్తగా రాజ్యసభకు ఎంపికైన ఎంపీలకు రాజ్యసభ చైర్మన్ వెంకయ్య నాయుడు, ప్రధాని నరేంద్ర మోదీ అభినందనలు తెలియజేశారు. రాజ్యసభలో వెంకయ్య నాయుడు మాట్లాడుతూ..పదవీ కాలం ముగిసిన సభ్యుల్లో కొందరు మళ్లీ ఎంపికయ్యారని అన్నారు. రాజ్యసభలో ఉన్న సభ్యులు దేశానికి ఆదర్శంగా నిలవాలని సూచించారు. సభలో పలు రంగాల్లో అనుభవజ్ఞులైన సభ్యులు ఉన్నారని వ్యాఖ్యానించారు. సభను హుందాగా నిర్వహించేందుకు సభ్యులు సహకరించాలని కోరారు. ప్రధాని నరేంద్ర మోదీ మాట్లాడుతూ..విశ్రాం జీవితం సుఖ సంతోషాలతో నిండాలని ఆశిస్తున్నట్లు తెలిపారు. వైఎస్ ఛైర్మన్‌గా కురియన్ సేవలు మరువలేనివన్నారు. ఉత్తమ సేవలు అందించిన సభ్యులకు మరోసారి అభినందనలు చెప్పారు. -
మేడారం జాతరకు వెంకయ్య
సాక్షి, న్యూఢిల్లీ: ఉప రాష్ట్రపతి ఎం.వెంకయ్యనాయుడు మేడారం జాతరలో పాల్గొననున్నారు. శుక్రవారం ఉదయం ఢిల్లీ నుంచి ప్రత్యేక విమానంలో ఏపీలోని గన్నవరం విమానాశ్రయం చేరుకుంటారు. అక్కడి నుంచి హెలికాప్టర్లో మేడారం చేరుకుని సమ్మక్క సారలమ్మ జాతరను సందర్శిస్తారు. ఈ సందర్భంగా వనదేవతలకు బంగారం (బెల్లం) సమర్పించి వెంకయ్య మొక్కులు చెల్లించుకోనున్నారు. -
'దేశంలో అనేక మార్పులకు ఆద్యుడు వాజ్‌పేయ్'
అమరావతి: స్వాతంత్య్ర భారతదేశంలో అనేక మార్పులకు ఆద్యుడు మాజీ ప్రధాని, భారతరత్న వాజ్‌పేయ్ అని కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు కొనియాడారు. వాజ్‌పేయ్ జన్మదినం సందర్బంగా సుపరిపాలన దినంగా కేంద్రం ప్రకటించిన నేపథ్యంలో ఆదివారం విజయవాడలో భారతీయ జనతాపార్టీ ఏర్పాటుచేసిన పలు కార్యక్రమాల్లో ఆయన పాల్గొన్నారు. విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలో పేదలకు దుప్పట్లు పంచిపెట్టారు. అనంతరం ఏలూరు రోడ్డులో జరిగిన ఓ కార్యక్రమంలో పార్టీ కార్యకర్తలను ఉద్దేశించి ప్రసంగించారు. దేశాన్ని నెహ్రూ కుటుంబం తప్ప మరెవరూ ఐదేళ్లపాటు సుస్థిరంగా పరిపాలించలేరని ఒక రకమైన వాదన ఉన్న రోజుల్లో 23 రాజకీయ పార్టీలతో కూడిన సంకీర్ణ ప్రభుత్వంతో ఐదేళ్లపాటు సుస్థిర పాలన అందించిన ఘనత వాజ్‌పేయ్‌దేనని చెప్పారు.