‘మూసీ ప్రక్షాళనపై ప్రభుత్వానికి ఆదేశాలు ఇవ్వండి’ | KomatiReddy Venkat Reddy Meets With Vice President Venkaiah Naidu In Delhi | Sakshi
Sakshi News home page

‘మూసీ ప్రక్షాళనపై ప్రభుత్వానికి ఆదేశాలు ఇవ్వండి’

Published Wed, Feb 19 2020 2:04 PM | Last Updated on Wed, Feb 19 2020 2:32 PM

KomatiReddy Venkat Reddy Meets With Vice President Venkaiah Naidu In Delhi - Sakshi

న్యూఢిల్లీ: తెలంగాణ గంగ మూసీ నదిని పరిరక్షించాలని నల్గొండ ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడికి విజ‍్ఞప్తి చేశారు. ఆయన బుధవారం ఉపరాష్ట్రపతితో భేటీ అయ్యారు. భేటీ అనంతరం కోమటిరెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. కాలుష్యంతో మూసీనది ఉనికి ప్రశ్నార్థకంగా మరిందని తెలిపారు. ఫార్మా కంపెనీలు, డ్రైనేజీ నీరుతో భూగర్భ జాలాలు కలుషితమవుతున్నాయని ఉపరాష్ట్రపతి దృష్టికి తీసుకువెళ్లామన్నారు. మూసీ పరివాహక ప్రాంతాల్లో 300 నుంచి 500 ఫీట్ల లోతు వరకు భూగర్భ జలాలు కలుషితమవుతున్నాయని ఆయన పేర్కొన్నారు.

ఆ నీటితో పండిన పంటలు తినడం వల్ల జనాలు అనారోగ్యం పాలవుతున్నారని చెప్పారు. మూసీ నీరు తాగడం వల్ల పశువులు మరణిస్తున్నాయని.. నమామి గంగ తరహాలో మూసీ ప్రక్షాళన చేపట్టాలని ఉపరాష్ట్రపతిని వెంకయ్యనాయుడిని కోరినట్లు కోమటిరెడ్డి వెంకటరెడ్డి తెలిపారు. ఈ విషయాన్ని పార్లమెంటు జిరో ఆవర్‌లో లెవనెత్తినా కేంద్రం స్పందించలేదన్నారు. మూసీ ప్రక్షాళనపై కేంద్ర, రాష్ట ప్రభుత్వాలకు ఆదేశాలు జారి చేయాలని వెంకయ్యనాయుడికి విజ్ఞప్తి చేశామన్నారు. ట్రిట్‌మెంట్‌ ప్లాంట్ల ఏర్పాటు, విరివిగా చెట్ల పెంపకం, పరిశ్రమ వ్యర్థాల కట్టడి ద్వారా మూసీని పరిరక్షించాలని కోమటిరెడ్డి వెంకటరెడ్డి తెలిపారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement