మాటలతో మభ్యపెడుతున్న సీఎం
-
వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు నాడెం శాంతికుమార్
కాజీపేట రూరల్ : రాష్ట్ర ప్రజలను పీఎం కేసీఆర్ మాటలతో మభ్యపెడుతున్నారని వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు నాడెం శాంతికుమార్ విమర్శించారు. హన్మకొండలోని వైఎస్సార్ సీపీ కార్యాలయంలో బుధవారం జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్రజలకు ఇచ్చిన హామీలను పక్కనపెట్టి నిరుద్యోగులు, ప్రజాసంక్షేమాన్ని పట్టించుకోకుం డా రాష్ట్రంలోని టీఆర్‌ఎస్ పాలన కొనసాగుతోందని ఎద్దేవా చేశారు. తె లంగాణలో 250మంది రైతులు ఆత్మహత్యలు చేసుకుంటే వారిలో 10 మందికే ఎక్స్‌గ్రేషియా ఇవ్వడం ప్రస్తుత టీఆర్‌ఎస్ ప్రభుత్వ పనితీరుకు నిదర్శంగా నిలుస్తోందన్నారు. అలాగే, జనగాం జిల్లా డిమాండ్‌ను పట్టిం చుకోకుండా ఎవరూ అడగని హన్మకొండను జిల్లాగా చేయడం ఏమిటని ప్రశ్నించారు. కాగా, పరకాలలోని మహానేత వైఎస్ రాజశేఖర్‌రెడ్డి విగ్రహాన్ని ధ్వంసం చేయడం అమానుషమన్నారు. ఈ ఘటనపై పోలీసులకు ఫిర్యాదు చేసినా ఇప్పటి వరకు ఎలాంటి ఫలితం లేదని ఆరోపించారు. సమావేశంలో వైఎస్సార్ సీపీ రాష్ట్ర కార్యదర్శి సంగాల ఈర్మియాతో పాటు నాయకులు బీంరెడ్డి స్వప్న, దోపతి సుదర్శన్‌రెడ్డి, అప్పం కిషన్, విల్సన్‌రాబర్ట్, అచ్చిరెడ్డి, బొచ్చు రవి, నాగవెల్లి రజినీకాంత్, దొంతి కమలాకర్‌రెడ్డి, చంద హరికృష్ణ, గుండ్ల రాజేష్‌రెడ్డి, దుప్పటి ప్రకాష్ పాల్గొన్నారు.
గ్రామస్థాయిలో పార్టీని బలోపేతం చేయాలి
గ్రామస్థాయి నుంచి వైఎస్సార్ సీపీని బలోపేతం చేసేందుకు కార్యకర్తలు కృషి చేయాలని జిల్లా అధ్యక్షుడు నాడెం శాంతికుమార్ కోరారు. హన్మకొండలోని వైఎస్సార్ సీపీ కార్యాలయంలో బుధవారం జరిగిన వర్ధన్నపేట నియోజకవర్గ సమీక్ష సమావేశంలో ఆయన మాట్లాడారు. సమావేశంలో సైదులు, ముసాని సుధాకర్, జివీరభద్రం, అనిల్, పసునూరి ప్రభాకర్, రామిండ్ల అయిలయ్య, బోల్ల సోమనర్సయ్య, భువనగరి ఉప్పలయ్య, పొడిశెట్టి యాకయ్య పాల్గొన్నారు.