trs govenrment
-
ఏడాదంతా రంజు రంజుగా తెలంగాణ రాజకీయం
-
మాటలతో మభ్యపెడుతున్న సీఎం
వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు నాడెం శాంతికుమార్ కాజీపేట రూరల్ : రాష్ట్ర ప్రజలను పీఎం కేసీఆర్ మాటలతో మభ్యపెడుతున్నారని వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు నాడెం శాంతికుమార్ విమర్శించారు. హన్మకొండలోని వైఎస్సార్ సీపీ కార్యాలయంలో బుధవారం జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్రజలకు ఇచ్చిన హామీలను పక్కనపెట్టి నిరుద్యోగులు, ప్రజాసంక్షేమాన్ని పట్టించుకోకుం డా రాష్ట్రంలోని టీఆర్ఎస్ పాలన కొనసాగుతోందని ఎద్దేవా చేశారు. తె లంగాణలో 250మంది రైతులు ఆత్మహత్యలు చేసుకుంటే వారిలో 10 మందికే ఎక్స్‌గ్రేషియా ఇవ్వడం ప్రస్తుత టీఆర్ఎస్ ప్రభుత్వ పనితీరుకు నిదర్శంగా నిలుస్తోందన్నారు. అలాగే, జనగాం జిల్లా డిమాండ్‌ను పట్టిం చుకోకుండా ఎవరూ అడగని హన్మకొండను జిల్లాగా చేయడం ఏమిటని ప్రశ్నించారు. కాగా, పరకాలలోని మహానేత వైఎస్ రాజశేఖర్‌రెడ్డి విగ్రహాన్ని ధ్వంసం చేయడం అమానుషమన్నారు. ఈ ఘటనపై పోలీసులకు ఫిర్యాదు చేసినా ఇప్పటి వరకు ఎలాంటి ఫలితం లేదని ఆరోపించారు. సమావేశంలో వైఎస్సార్ సీపీ రాష్ట్ర కార్యదర్శి సంగాల ఈర్మియాతో పాటు నాయకులు బీంరెడ్డి స్వప్న, దోపతి సుదర్శన్‌రెడ్డి, అప్పం కిషన్, విల్సన్‌రాబర్ట్, అచ్చిరెడ్డి, బొచ్చు రవి, నాగవెల్లి రజినీకాంత్, దొంతి కమలాకర్‌రెడ్డి, చంద హరికృష్ణ, గుండ్ల రాజేష్‌రెడ్డి, దుప్పటి ప్రకాష్ పాల్గొన్నారు. గ్రామస్థాయిలో పార్టీని బలోపేతం చేయాలి గ్రామస్థాయి నుంచి వైఎస్సార్ సీపీని బలోపేతం చేసేందుకు కార్యకర్తలు కృషి చేయాలని జిల్లా అధ్యక్షుడు నాడెం శాంతికుమార్ కోరారు. హన్మకొండలోని వైఎస్సార్ సీపీ కార్యాలయంలో బుధవారం జరిగిన వర్ధన్నపేట నియోజకవర్గ సమీక్ష సమావేశంలో ఆయన మాట్లాడారు. సమావేశంలో సైదులు, ముసాని సుధాకర్, జివీరభద్రం, అనిల్, పసునూరి ప్రభాకర్, రామిండ్ల అయిలయ్య, బోల్ల సోమనర్సయ్య, భువనగరి ఉప్పలయ్య, పొడిశెట్టి యాకయ్య పాల్గొన్నారు. -
'టీఆర్ఎస్ ప్రభుత్వం పడిపోయే ఆధారాలున్నాయి'
-
'టీఆర్ఎస్ ప్రభుత్వం పడిపోయే ఆధారాలున్నాయి'
తమ వద్ద టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని పడగొట్టగలిగిన స్థాయిలో ఆధారాలున్నాయని ఆంధ్రప్రదేశ్ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు అన్నారు. చంద్రబాబు నాయుడితో మంత్రుల సమావేశం అయిన అనంతరం ఆయన మరో మంత్రి అచ్చెన్నాయుడితో కలిసి సచివాలయంలో మీడియాతో మాట్లాడారు. ఆయనేమన్నారంటే.. ''టీడీపీ ప్రభుత్వాన్ని ఇరకాటంలో పెట్టే ప్రయత్నం టీఆర్ఎస్ ప్రభుత్వం చేస్తోంది. ఏసీబీకి నోటీసులు జారీచేసే అధికారం లేదు. కోడ్ ఆఫ్ కండక్ట్ అమలులోకి వచ్చినప్పుడు, ఎన్నికల ప్రక్రియ ఉన్నందువల్ల అంతా ఎన్నికల కమిషన్ పరిధిలోకి వస్తుంది. ఎలాంటి చర్య విషయంలోనైనా ఈసీ జోక్యం చేసుకోవాలి. ఏసీబీ కేవలం ఉద్యోగుల అవినీతిని అరికట్టడానికే ఏర్పాటైంది. ఈసీ మాత్రమే ఇలాంటి సందర్భంలో రియాక్ట్ అవ్వాలి. కానీ ఇక్కడ ఏసీబీతో నోటీసులు ఇప్పిస్తున్నామంటూ లీకులిస్తున్నారు. ఏసీబీకి నోటీసులిచ్చే అధికారంలేదు, దానికి భయపడాల్సిన అవసరం లేదు. చంద్రబాబు సంభాషణలు అంటున్నారు.. అది ఎక్కడి నుంచి వచ్చిందనే విషయాన్ని తెలంగాణ ముఖ్యమంత్రి గానీ, ఏసీబీ అధికారులు గానీ ఈ నిమిషం వరకు చెప్పలేకపోతున్నారు. నోటీసులు ఇవ్వబోతున్నారు, సీఎం రాజీనామా చేస్తారు, అశోక్ సీఎం అవుతారు అంటూ తప్పుడు వార్త పంపిస్తున్నారు. తాటాకు చప్పుళ్లకు మేం భయపడేది లేదు. కేసీఆర్ మీద ఏపీలో నమోదైన 87 కేసులపై ఏపీ ప్రభుత్వం సిట్ విచారణ జరపబోతోంది. మత్తయ్యను బెదిరించడంపై సీబీసీఐడీ విచారణ జరపబోతోంది. ఫోన్ ట్యాపింగ్‌కు మా వద్ద పక్కా ఆధారాలున్నాయి. మేం భయపడాల్సిన అవసరం లేదు. కానీ మా దగ్గర తెలంగాణ ప్రభుత్వం కూలిపోయే ఆధారాలున్నాయి. తెలుగుదేశం పార్టీతో పెట్టుకున్న కాంగ్రెస్ నాయకులు ఏమయ్యారో ఒక్కసారి చూడండి. పెట్టుకునేవాళ్లకు అదే పరిస్థితి ఎదురవుతుంది. ఈరోజు ఒక అడుగు మీరు ముందుకేస్తే ఏపీ ప్రభుత్వం రెండు అడుగులు ముందుకేయడానికి సిద్ధంగా ఉంది. ఉమ్మడి రాష్ట్రంలో ఇద్దరికీ అధికారాలున్నాయి. భయపడాల్సిన అవసరం లేదు, రాజీనామా అక్కర్లేదు, ఏపీ ప్రజలు కూడా భయపడక్కర్లేదు''