రోడ్డెక్కిన నోటు బాధితులు
Published Wed, Dec 7 2016 12:16 AM | Last Updated on Thu, Aug 30 2018 4:07 PM
గోనెగండ్ల: నగదు కష్టాలతో రైతులు సహనం కోల్పోతున్నారు. వరుసగా రెండు రోజులుగా గోనెగొండ్ల ఎస్‌బీఐ బ్రాంచ్‌లో నగదు కొరతతో ఖాతాదారులకు విత్‌డ్రా అవకాశం లేకపోవడంతో రైతులు, వృద్ధులు తదితరులు మంగళవారం ఆందోళనకు దిగారు. కర్నూలు - ఎమ్మిగనూరు ప్రధాన రహదారిపై రాస్తారోకో చేపట్టారు. నగదు ఇచ్చే వరకు రోడ్డుపై నుంచి కదలమని భీష్మించారు. పోలీసు సిబ్బంది వచ్చి సముదాయించేందుకు ప్రయత్నించినా లాభం లేకపోయింది. ఎస్‌ఐ కృష్ణమూర్తి మహిళలను, రైతులను ఆందోళన విరమించాలని కోరారు. నోటు బాధితులు ఎస్‌ఐతో వాగ్వాదానికి దిగారు.బ్యాంక్‌లో డబ్బును విత్‌డ్రాయిల్ లేకుంటే కూలీలకు డబ్బులు ఎలా ఇవ్వాలని రైతులు, ఇంట్లో సరుకుల్లేకుంటే పస్తులుండాలా అంటూ మహిళలు ప్రశ్నించారు. చివరకు బ్యాంక్ మేనేజర్ వెంకన్నబాబు ఉన్నతాధికారులతో మాట్లాడారని కర్నూలుకు నగదు వచ్చిన వెంటనే ఇస్తారని పోలీసులు చెప్పడంతో వారు శాంతించి ఆందోళన విరమించారు.
Advertisement
Advertisement