ఎరువుల దుకాణాలపై విజిలెన్స్ దాడులు
పాచిపెంట : మండల కేంద్రంలో రెండు ఎరువుల దుకాణాలతో పాటు చినబజార్ సెంటర్‌లోని పెస్టిసైడ్స్ దుకాణాలపై విజిలెన్స్ అధికారులు బుధవారం దాడులు చేపట్టారు. ఈ సందర్భంగా రికార్డులు, నిల్వలను సరిపోల్చాచరు. రశీదు బుక్ సరిగ్గా లేకపోవడంతో శ్రీ కష్ణా ఎరువుల దుకాణంలో అమ్మకాలు నిలిపివేయాలని ఆదేశించారు. భూర త్రినాథ్ ఎరువుల షాపునకు సంబంధించి ప్రత్యేకంగా నిల్వలు ఉంచేందుకు గది నిర్మాణం చేపట్టాలని సూచించారు. చినబజార్ సెంటర్‌లో గల శ్రీసాయిరాం పెస్టిసైడ్స్ దుకాణానికి సంబంధించి ఓచర్లు సరిగ్గా లేకపోవడంతో రశీదులు వచ్చాక విక్రయాలు చేపట్టాలని ఆదేశించారు. కార్యక్రమంలో విజిలెన్స్ డీడీ పి.వి.ఎస్.సి హరి, ఏడీఏ విజయకుమార్, ఏడీ చంద్రశేఖర్‌లతో పాటు పాచిపెంట వ్యవసాయాధికారి వి.వెంకటయ్య, ఎం.బాబ్జిలు పాల్గొన్నారు.