గ్రామాభివృద్ధికి ఓఎన్‌జీసీ హామీ ఇవ్వాల్సిందే..
గ్రామాభివృద్ధికి ఓఎన్‌జీసీ హామీ ఇవ్వాల్సిందే..
Published Wed, Oct 19 2016 11:04 PM | Last Updated on Mon, Sep 4 2017 5:42 PM
నేదునూరు (అయినవిల్లి) : నేదునూరు ఓఎన్‌జీసీ వద్ద అ గ్రామస్తులు బుధవారం ఆందోళన చేశారు. తమ గ్రామ అభివృద్ధికి సంస్థ సహకారం అందిస్తుందని హామీ ఇచ్చిన అధికారులు పట్టించుకోకపోవడంతో సంస్థ రిగ్ వద్దకు గ్రామస్తులు పెద్ద ఎత్తున చేరుకుని ఉదయం 8 గంటల నుంచి మధ్యాహం రెండు గంటల వరకూ ఆందోళన చేశారు. ఓఎన్‌జీసీ సంస్థ కార్యాకలపాలతో భవిషత్‌లో తమ గ్రామానికి పెనుముప్పు పొంచి ఉందన్నారు. ఇప్పటికే గ్రామంలో రహదారులు దెబ్బతినాయన్నారు. రిగ్ వద్ద పనులు చేయకుండా ఉద్యోగస్తులను అడ్డుకున్నారు. తమ గ్రామ అభివృద్ధికి స్వష్టమైన హమీ ఇచ్చే వరకూ పనులను జరగనీయబోమని నినదించారు. వెంటనే ఓఎన్‌జీసీ సంస్థకు చెందిన ఉన్నతాధికారులకు ఈ విషయాన్ని తీసు కెళ్లాలని పట్టుబట్టారు. దీంతో అక్కడి అధికారులు ఉన్నతాధికారులతో ఫొన్లో చర్చించి గ్రామస్తులకు తగు న్యాయం చేస్తామని హామీ ఇవ్వడంతో ఆందోళనను విరమించారు. ఆందోళనలో సర్పంచ్ కామన కృష్ణమూర్తి, ఎంపీటీసీ సభ్యుడు కనుమూరి సత్యనారాయణరాజు, కళ్లేపల్లిసోంబాబు, కుడుపూడి సత్యనారాయణ, జంగా శ్రీని వాస్, పులిదిండి ప్రభాకర్, అయినంపూడి నారాయణరా జు, జంగా వెంకటరమణ, పినిపే ప్రసాద్, వస్కా కృష్ణమూర్తిలతో పాటు మహిళలు, విద్యార్థులు పాల్గొన్నారు.
Advertisement