మూడు రోజులు విశాఖలోనే రాష్ర్టపతి, ప్రధాని
వచ్చే నెల 5న ఇరువురి రాక
సాక్షి, విశాఖపట్నం: రాష్ర్టపతి ప్రణబ్ ముఖర్జీ, ప్రధానమంత్రి నరేంద్ర మోదీల పర్యటన ఖరారైంది. రాష్ట్రపతి ఫిబ్రవరి 5సాయంత్రం 6.30 గంటలకు ఢిల్లీలో బయల్దేరి రాత్రి 9.10 గంటలకు విశాఖ ఎయిర్‌పోర్టుకు చేరుకుంటారు. ఐఎన్‌ఎస్ డేగాలో బస చేస్తారు. 6వ తేదీ ఉదయం 9 నుంచి 11.45 గంటల వరకు ఫ్లీట్ రివ్యూలో పాల్గొంటారు. సాయంత్రం 5.20 నుంచి 6.30 వరకు నేవల్ ఆడిటోరియం సముద్రికలో జరిగే కార్యక్రమాల్లో పాల్గొం టారు. రాత్రి 7.40 గంటల నుంచి 9 గంటల వరకు ఈస్ట్రన్ నేవల్ కమాండ్ ఆఫీసర్స్ మెస్‌లో ప్రెసిడెన్షియల్ డిన్నర్‌లో పాల్గొం టారు. 7వ తేదీ ఉదయం 11.10 గంటలకు ప్రత్యేక విమానంలో ఢిల్లీకి బయల్దేరి వెళ్తారు.
ప్రధాని మోదీ పర్యటన ఇలా..
ప్రధాని కూడా వచ్చే నెల 5నే విశాఖ వస్తారు. గౌహతి నుంచి ప్రత్యేక విమానంలో రాత్రి 7.40 గంటలకు బయల్దేరి 10.15 గంటలకు విశాఖ చేరుకుంటారు. ఆరో తేదీ ఉదయం 8.30 నుంచి రాత్రి 9 గంటల వరకు నేవీ ఫ్లీట్ రివ్యూలో పాల్గొంటారు. 9.25 గంటలకు ప్రత్యేక విమానంలో భువనేశ్వర్ వెళతారు. 7వ తేదీ మధ్యాహ్నం వరకు భువనేశ్వర్‌లో జరిగే కార్యక్రమాల్లో పాల్గొన్న అనంతరం 3.35 గంటలకు బయల్దేరి తిరిగి విశాఖపట్నం చేరుకుంటారు. రాత్రి 9 గంటల వరకు ఫ్లీట్ రివ్యూలో, అనంతరం డిన్నర్‌లో పాల్గొంటారు. అదే రోజు రాత్రి 9.25 గంటలకు ప్రత్యేక విమానంలో ఢిల్లీకి పయనమవుతారు.