సందర్శకుల తాకిడి
ధర్పల్లి:
రామడుగు ప్రాజెక్ట్‌లోకి 4 వేల క్యూసెక్కుల ఇన్‌ఫ్లో వచ్చి చేరుతోంది. ఎగువ ప్రాంతంలోని లింగాపూర్ వాగుతో పాటు పరసర ప్రాంతాల నుంచి వరద వస్తోంది. ప్రస్తుతం ప్రాజెక్టులో 1,278.30 అడుగుల మేర నీరు నిల్వ ఉంది. వచ్చిన నీరు వచ్చినట్లు అలుగు నుంచి వెళ్లిపోతోంది. మరోవైపు, ప్రాజెక్టుకు సందర్శకుల తాకిడి పెరిగింది. జల సిరులను తిలకించేందుకు పర్యాటకులు పెద్ద సంఖ్యలో తరలివస్తున్నారు. ధర్పల్లి, డిచ్‌పల్లి, భీమ్‌గల్, వేల్పూర్ మండలాలకు చెందిన సందర్శకులు వచ్చి ప్రాజెక్ట్‌ను తిలకించారు.