ఓటర్ నమోదును వేగవంతం చేయాలి
► ఎన్నికల పరిశీలకులు వీరబ్రహ్మయ్య
ధర్మపురి : నూతన ఓటరు నమోదు ప్రక్రియను వేగవంతం చేయాలని రాష్ట్ర ఎన్నికల పరిశీలకులు వీరబ్రహ్మయ్య బీఎల్‌వోలను ఆదేశించారు. ధర్మపురి మేజర్‌పంచాయతీ కార్యాలయంలో ఆదివారం ఓటరు నమోదుకు సంబంధించిన ఫారం– 6, 7, 8లను పరిశీలించారు. ఫారం–6 కొత్త ఓటరు నమోదు చేసుకోవడం కోసం, ఫారం–7 చనిపోయిన వారి పేర్లు తొలగించడం కోసం, వివాహమై వెళ్లిన వారి పేర్లు తొలగించడం కోసం అదే విధంగా 8ఏ ఫారం ఓటరు నమోదులో తప్పొప్పులను సవరించడం కోసం ఉపయోగించాలన్నారు. ఈకార్యక్రమంలో తహసీల్దార్ మహేశ్వర్, ఆర్‌ఐ శరత్, అంగన్ వాడలు మాధవీలత, రమాదేవి, బేర విజయలక్ష్మీ పుష్పలత ఉన్నారు.