మూడు రోజుల్లో ఆయకట్టుకు నీరు
-
కాకినాడ ఆర్డీఓ అంబేడ్కర్
-
‘సాక్షి’ ఎఫెక్ట్
పిఠాపురం :
ఏలేరు, పీబీసీ పరిధిలో ఆయకట్టు భూములకు మరో మూడు రోజుల్లో సాగునీరు పూర్తి స్థాయిలో అందిస్తామని కాకినాడ ఆర్డీఓ అంబేద్కర్ తెలిపారు. ‘సాక్షి’ దినపత్రికలో బుధవారం ‘అనావృషే్టనా?’ అనే శీర్షికన వెలువడిన కథనానికి జిల్లా కలెక్టర్ హెచ్.అరుణ్‌కుమార్ స్పందించారు. ఆయన ఆదేశాల మేరకు రెవెన్యూ, వ్యవసాయశాఖాధికారులు పిఠాపురం నియోజకవర్గంలోని ఏలేరు శివారు ఆయకట్టులో సాగునీరు అందక ఇప్పటికీ నాట్లు పడని ప్రాంతాలను పరిశీలించారు. ఆర్డీఓ మాట్లాడుతూ పత్రికలో వచ్చిన కథనంపై ఆ ప్రాంతాలను పరిశీలించి వెంటనే చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టరు ఆదేశించారన్నారు. ఇప్పటి వరకు సాగునీరు సరఫరాలో ఇబ్బందులు ఎదురైనప్పటì కీ రెండు రోజుల నుంచి నీటి విడుదల అనుకున్న స్థాయిలో వస్తోందనితెలిపారు. నీరు అందక బీడులుగా ఉన్న పొలాలకు మూడురోజుల గడువు ఉందని వాటన్నిటికి కచ్చితంగా నీరు అందే ఏర్పాట్లు చేశామన్నారు. రైతులు ఎవరు అధైర్యపడాల్సిన పని లేదని సాగునీరు విషయంలో ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు తీసుకున్నామన్నారు. ఆయన వెంట వ్యవసాయ శాఖ జేడీ కేఎస్‌వీ ప్రసాద్, డీడీ వీపీ రామారావు, ఏడీఏ పద్మశ్రీ, తహసీల్దారు సుగుణ తదితరులున్నారు.