
అన్నా... మా కాలనీలో వెయ్యి కుటుంబాలు నివసిస్తున్నాం. రోజుల తరబడి నీటి సమస్యతో అల్లాడుతున్నాం. పాలకులు పట్టించుకోవడం లేదు’. అని గుడివాడ కాళహస్తి కాలనీకి చెందిన బి. సుజాత ప్రజా సంకల్పయాత్రలో జననేత జగన్ వద్ద ఆవేదన వ్యక్తం చేశారు. ప్రజా సంకల్పయాత్రలో భాగంగా గుడివాడ వచ్చిన జననేతకు నీటి సమస్య గురించి సుజాత వివరించారు. ఎమ్మెల్యే కొడాలి నాని ట్యాంకర్ల ద్వారా నీరు సరఫరా చేస్తున్నారని, ప్రభుత్వం మాత్రం పట్టించుకోవడంలేదని వాపోయారు. రాజకీయ కుట్రతోనే తమకు తాగు నీటి సదుపాయం కల్పించడం లేదని ఆమె జననేతకు తన గోడును వినిపించారు.