కేసీ కాల్వకు 2,600 క్యూసెక్కుల నీరు విడుదల
కేసీ కాల్వకు 2,600 క్యూసెక్కుల నీరు విడుదల
Published Wed, Sep 21 2016 7:55 PM | Last Updated on Mon, Sep 4 2017 2:24 PM
జూపాడుబంగ్లా: సుంకేసుల జలాశయం నుంచి కేసీ కాల్వకు 2,600క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నట్లు ఏఈ నరేష్ తెలిపారు. బుధవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాలతో సుంకేసుల జలాశయంలోకి 2,800క్యూసెక్కుల వరదనీరు వచ్చిచేరుతోందన్నారు. అందులో 2,600క్యూసెక్కుల నీటిని కేసీ కాల్వకు విడుదల చేస్తున్నట్లు తెలిపారు. కేసీ కాల్వకు సరఫరా అయ్యే నీటిలో అలగనూరు రిజర్వాయర్‌కు 900, నిప్పులవాగుకు 700, తూడిచెర్ల సబ్‌చానల్‌కు 200క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నట్లు ఆయన తెలిపారు. కేSసీ కాల్వకు కేటాయించిన 3టీఎంసీల నీటిలో ఇప్పటిదాకా3000 క్యూసెక్కులు మాత్రమే వాడుకున్నట్లు ఆయన తెలిపారు.
Advertisement