కుందూకి నీటి విడుదల
కోవెలకుంట్ల: కుందూనది పరీవాహక ప్రజల తాగు, సాగునీటి అవసరాలను దృష్టిలో ఉంచుకుని ఎట్టకేలకు అధికారులు నీటిని విడుదల చేశారు. వేసవికాలం ప్రారంభం కాకముందే నది ఒట్టిపోవడంతో డివిజన్‌లోని 30 గ్రామాల ప్రజలు నీటికోసం వారం రోజుల నుంచి తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. నదీ పరీవాహకంలో సుమారు 2వేల హెక్టార్లలో రైతులు వరి, మినుము, కొర్ర, తదితర పంటలు సాగుచేయగా.. పంట చేతికందే తరుణంలో నది ఎండిపోయి సాగునీటి కష్టాలు తలెత్తాయి. రైతులు, ప్రజల అభ్యర్థన మేరకు అలగనూరు రిజర్వాయర్ నుంచి నీటిని విడుదల చేయడంతో నదిలో కొంతమేర నీరు చేరడంతో రైతులు ఊపిరి పీల్చుకున్నారు.