kundu
-
కుందూలో భూమాకు పిండ ప్రదానం
ఉయ్యాలవాడ : దివంగత ఎమ్మెల్యే భూమా నాగిరెడ్డి పెద్దకర్మ సందర్భంగా కుమారుడు జగత్‌విఖ్యాత్‌రెడ్డి గురువారం ఉయ్యాలవాడ సమీప కుందూనదిలో వేదపండితుల మంత్రోచ్ఛరణల మధ్య తండ్రికి పిండ ప్రదానం చేశారు. ఆళ్లగడ్డ పట్టణ పరిసర ప్రాంతాల్లోని నదులు, వాగుల్లో నీటి పారకం లేకపోవడంతో ప్రత్యేక వాహనాల్లో తరలివచ్చి ఉయ్యాలవాడ, రూపనగుడి మధ్య కుందూనదిలో పిండప్రదానం చేశారు. భూమా బ్రహ్మానందరెడ్డి, భూమా కిశోర్‌రెడ్డి, భూమా మహేష్‌రెడ్డి, భూమా జగన్నాథరెడ్డితో పాటు స్థానిక నాయకులు బుడ్డా రామిరెడ్డి, కూడాల నారాయణరెడ్డి తదితర నాయకులు పాల్గొన్నారు. -
కుందూకి నీటి విడుదల
కోవెలకుంట్ల: కుందూనది పరీవాహక ప్రజల తాగు, సాగునీటి అవసరాలను దృష్టిలో ఉంచుకుని ఎట్టకేలకు అధికారులు నీటిని విడుదల చేశారు. వేసవికాలం ప్రారంభం కాకముందే నది ఒట్టిపోవడంతో డివిజన్లోని 30 గ్రామాల ప్రజలు నీటికోసం వారం రోజుల నుంచి తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. నదీ పరీవాహకంలో సుమారు 2వేల హెక్టార్లలో రైతులు వరి, మినుము, కొర్ర, తదితర పంటలు సాగుచేయగా.. పంట చేతికందే తరుణంలో నది ఎండిపోయి సాగునీటి కష్టాలు తలెత్తాయి. రైతులు, ప్రజల అభ్యర్థన మేరకు అలగనూరు రిజర్వాయర్ నుంచి నీటిని విడుదల చేయడంతో నదిలో కొంతమేర నీరు చేరడంతో రైతులు ఊపిరి పీల్చుకున్నారు. -
పురాతన ఆలయాల పునర్నిర్మాణం
కోవెలకుంట్ల: సుమారు వెయ్యి సంవత్సరాల క్రితం కుందూ వరదలతో కనుమలపాడు అనే గ్రామం కాలగర్భంలో కలిసిపోగా.. ఆ గ్రామానికి సంబం«ధించిన పురాతన ఆలయాలను ఇటీవల పునర్నిర్మించారు. కోవెలకుంట్ల పట్టణ శివారులోని ప్రస్తుతం పాటి ఆంజనేయస్వామిగా పిలుస్తున్న ప్రాంతంలో కనుమలపాడు గ్రామం ఉన్నట్లు పూర్వీకుల చరిత్ర. ఈ గ్రామానికి ఒక వైపు ఆంజనేయస్వామి దేవాలయం, శివాలయం, మరో వైపున భైరవుడి దేవాలయాలు ఉన్నాయి. భైరవ దేవాలయ సమీపంలోని కోనేటిలో ప్రజలు స్నానాలు చేసి ఆయా ఆలయాల్లోని దేవుళ్లకు పూజలు చేసేవారు. ఆలయాలు శిథిలావస్థకు చేరుకోవడంతో పట్టణానికి చెందిన పవన్ ఏజెన్సీ నిర్వాహకులు స్పందించారు. ఆంజనేయస్వామి దేవాలయం, శివాలయాన్ని పునర్నిర్మించారు. -
వంతెన గుంతలమయం
రాజుపాళెం: మండలంలోని వెల్లాల కుందూ నదిపై ఉన్న లోలెవెల్ వంతెన అక్కడక్కడా గుంతలు పడింది. ఆ దారిలో వెళ్లే వాహనదారులు ఇబ్బంది పడుతున్నారు. పంట పొలాలకు రైతులు, కూలీలు, వెల్లాలలోని శ్రీచెన్నకేశవ, సంజీవరాయ స్వాముల ఆలయాలకు భక్తులు వెళుతుంటారు. అధికారులు స్పందించి మరమ్మతులు చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. -
వంతెన గుంతలమయం
రాజుపాళెం: మండలంలోని వెల్లాల కుందూ నదిపై ఉన్న లోలెవెల్ వంతెన అక్కడక్కడా గుంతలు పడింది. ఆ దారిలో వెళ్లే వాహనదారులు ఇబ్బంది పడుతున్నారు. పంట పొలాలకు రైతులు, కూలీలు, వెల్లాలలోని శ్రీచెన్నకేశవ, సంజీవరాయ స్వాముల ఆలయాలకు భక్తులు వెళుతుంటారు. అధికారులు స్పందించి మరమ్మతులు చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది.