
వెల్లాల కుందూ నదిపై ఉన్న లోలెవెల్ వంతెన
రాజుపాళెం: మండలంలోని వెల్లాల కుందూ నదిపై ఉన్న లోలెవెల్ వంతెన అక్కడక్కడా గుంతలు పడింది. ఆ దారిలో వెళ్లే వాహనదారులు ఇబ్బంది పడుతున్నారు. పంట పొలాలకు రైతులు, కూలీలు, వెల్లాలలోని శ్రీచెన్నకేశవ, సంజీవరాయ స్వాముల ఆలయాలకు భక్తులు వెళుతుంటారు. అధికారులు స్పందించి మరమ్మతులు చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది.