త్వరలోనే రక్షిత పథకాలు పూర్తి చేస్తాం
Published Tue, Jul 19 2016 11:06 AM | Last Updated on Mon, Sep 4 2017 5:19 AM
రణస్థలం : ఎచ్చెర్ల మండలం తమ్మినాయుడుపేట వద్ద ఉన్న భారీ రక్షిత మంచినీటి పథకంSద్వారా ఎచ్చెర్ల, లావేరు, రణస్థలం మండలాల్లోని 175 గ్రామాలకు తాగునీరు సరఫరా చేస్తామని ఆర్‌డబ్ల్యూఎస్ డీఈ పి.సూర్యనారాయణ తెలిపారు. ఇందుకోసం రూ.90 కోట్లతో ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపామని చెప్పారు. రణస్థలం ఆర్‌డబ్ల్యూఎస్ కార్యాలయానికి సోమవారం విచ్చేసిన ఆయన రికార్డులను పరిశీలించారు. అనంతరం విలేకరులతో మాట్లాడుతూ రణస్థలం మండలంలోని పిషిణి, చిన్నపిషిణి, నెలివాడ గ్రామాల్లోని రక్షిత మంచినీటి పథకాలు త్వరలోనే పూర్తి చేస్తామని చెప్పారు. మోటార్లు, పైప్‌పులైన్ పనులకు ప్రభుత్వం 1.09 కోట్ల రూపాయలు మంజూరు చేసిందని వివరించారు. కొత్తముక్కాం, కొమరవానిపేట గ్రామాలకు రక్షిత పథకాలు ద్వారా తాగునీరు సరఫరా చేస్తామని చెప్పారు. కార్యక్రమంలో ఆర్‌డబ్ల్యూఎస్ జేఈ శివకుమార్ పాల్గొన్నారు.
Advertisement