ఎవరీ బాలుడు
కర్నూలు: 13 సంవత్సరాల వయస్సు ఉన్న బాలుడు ఇంటి నుంచి తప్పిపోయి బుధవారం రాత్రి గార్గేయపురం గ్రామంలో తాలూకా పోలీసులకు కనిపించాడు. బాలుడి సమాచారాన్ని పోలీసులు చైల్డ్ లైన్ సభ్యుడు కిరణ్‌కుమార్‌కు తెలియజేయగా వెంటనే బాలుడిని చైల్డ్‌లైన్ ఆఫీసుకు తీసుకెళ్లారు. ప్రస్తుతం వారి సంరక్షణలో ఉన్నాడు. వివరాలు కోరగా బాలుడి మానసిక పరిస్థితి సరిగా లేనందున తల్లిదండ్రుల పేరు, చిరునామా చెప్పలేకపోతున్నాడు. బాలుడిని గుర్తించిన కుటుంబ సభ్యులెవరైనా తగిన ఆధారాలతో చైల్డ్ లైన్ 1098ను సంప్రదించాలని కిరణ్ కుమార్ కోరారు. బాలుడిని గుర్తించినవారు 80999 04487 లేదా 99517 94490కు ఫోన్ చేసి సమాచారం అందించాలని కిరణ్‌కుమార్ గురువారం విడుదల చేసిన ప్రకటనలో విజ్ఞప్తి చేశారు.