యోగా వల్ల ఆసుపత్రులు ఖాళీ కావాలి
యోగా వల్ల ఆసుపత్రులు ఖాళీ కావాలి
Published Sun, Oct 2 2016 11:36 PM | Last Updated on Wed, May 29 2019 2:58 PM
ఆకివీడు : ఆసుపత్రులు ఖాళీ అయితేనే యోగా విజయవంతమైనట్టని రాష్ట్ర యోగా, స్పోర్ట్సు అధికారి పేరం రవీంద్రనాథ్ అన్నారు. గ్రామంలోని జిల్లా పతంజలి యోగారోగ్య కేంద్రంలో ఆదివారం జిల్లాస్థాయి యోగా పోటీలు నిర్వహించారు. పతంజలి పరిషత్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ పోటీల్లో 8 సంవత్సరాల చిన్నారుల నుంచి 60 సంవత్సరాల వృద్ధుల వరకూ పాల్గొని యోగాసనాలతో అబ్బుర పరిచారు. రాత్రి నిర్వహించిన ముగింపు సభలో రవీంద్ర మాట్లాడుతూ పాఠశాలస్థాయిలో యోగాను ప్రవేశ పెట్టి ప్రతి విద్యార్థి ఆరోగ్యంగా ఉండేందుకు రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 70 వేల పాఠశాలల్లో 14 వేల మంది ఉపాధ్యాయులకు యోగ శిక్షణ ఇప్పించామన్నారు. ఇకపై రోజూ యోగా, స్పోర్ట్సును రెండు పిరియడ్‌లుగా అమలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించిందన్నారు.
పతంజలి యోగారోగ్య కేంద్రం జిల్లా అధ్యక్షుడు డాక్టర్ పీబీ ప్రతాప్‌కుమార్ మాట్లాడుతూ ప్రతి ఆసుపత్రిని యోగా కేంద్రంగా మార్చే సత్తా ప్రజల్లో ఉందన్నారు. యోగా అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు వబలిశెట్టి శ్రీవెంకేటశ్వరరావు మాట్లాడుతూ ఈ పోటీల్లో 142 మంది పాల్గొన్నారని చెప్పారు. అనంతరం అంతర్జాతీయ, జాతీయస్థాయి యోగా చాంపియన్‌లను ఘనంగా సత్కరించారు. క్రీడాకారులందరికీ భోజన వసతిని రైస్ మిల్లర్, యోగా కేంద్రం ప్రతినిధి నేరెళ్ల రామ చెంచయ్య ఏర్పాటు చేశారు. పతంజలి కేంద్రం ప్రతినిధులు ఉండ్రమట్ల సాంబశివరావు, నేరెళ్ల రామ రోశయ్య, కుంకట్ల సత్యనారాయణ, యోగా సాంబశివరావు, వాణీశ్రీ, వెంకటేశ్వరరావు, భూపతిరాజు సత్యనారాయణరాజు, టి.రోషిణి, సీతారామయ్య, కె.సత్యనారాయణ, కేవీకే గాంధీ, కె.రమణారెడ్డి, వి.మోహన్, జి.సుబ్రహ్మణ్యంరాజు పాల్గొన్నారు.
Advertisement
Advertisement