వ్యవసాయంలో తోడుగా..
ధర్మవరం రూరల్ : వ్యవసాయంలో మహిళ పాత్ర ఎనలేనిది అని చెప్పడానికి ఈ చిత్రం ఉదాహరణ. కుటుంబమంతా కష్టపడితే కానీ పూట గడవడం కష్టంగా ఉన్న పరిస్థితుల్లో భర్తకు తోడుగా ఉంటోంది రేగాలిపల్లి గ్రామానికి చెందిన క్రిష్ణమ్మ. భర్త లక్ష్మిరెడ్డి పంటకు నీరు పెట్టడానికి పొలంలోనే ఉండాల్సి వచ్చింది. దీంతో ఆమె గడ్డి మోపులు వేసుకుని ఎద్దులబండి తోలుకుని కుటుంబ సభ్యులతో ఇంటికి వస్తుండగా ‘సాక్షి’ క్లిక్‌మనిపించింది.