సమావేశంలో మాట్లాడుతున్న చక్రపాణి
జగదేవ్‌పూర్: మహిళలు ఇంటి పనలకే పరిమితం కాకుండా వ్యవసాయ రంగంలో రాణించాలని, ముఖ్యంగా కూరగాయాల పంటలపై సాగు చేయాలని ఉద్యానశాఖ గజ్వేల్ డివిజన్ అధికారి చక్రపాణి అన్నారు. గురువారం జగదేవ్‌పూర్‌లో వెలుగు కార్యాలయంలో మహిళ గ్రామైఖ్య సంఘం సభ్యులకు వ్యవసాయంపై అవగాహన కల్పించారు.
మండల సమైఖ్య ఆధ్వర్యంలో సంతోష, ప్రొడ్యూసర్ కంపెనీ కమిటీని ఏర్పాటు చేసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన హాజరై మాట్లాడుతూ మహిళలు ప్రొడ్యూసర్ కంపెనీ ఏర్పాటు చేసుకోవడం హర్షణీయమన్నారు. గ్రామాల్లో కూరగాయాల పంటలపై రైతులకు అవగాహన కల్పించాలని కోరారు.
అలాగే వచ్చే ఏడాది వరకు యాక‌్షన్‌ప్లాన్‌ను తయారు చేసుకోవాలని సూచించారు. మండలంలోని పండించే కూరగాయాలను కొనుగోలు చేసి విక్రయించడం వల్ల ఆటు రైతులు, ఇటు సంఘం లాభపడుతారని వివరించారు. 10 గ్రామాలకు కలిసి ఇలాంటి కమిటీలను ఏర్పాటు చేసుకొవాలని సూచించారు. కార్యక్రమంలో డీపీఎం వాసుదేవ్, ఎంపీఎంలు అనంద్, సత్తయ్య, చంద్రయ్య, నర్సింలు, మహిళలు పాల్గొన్నారు.