మహిళా కూలీ ఆత్మహత్య | women suviside | Sakshi
Sakshi News home page

మహిళా కూలీ ఆత్మహత్య

Published Thu, Aug 11 2016 10:23 PM | Last Updated on Mon, Sep 4 2017 8:52 AM

women suviside

 
చిట్టినగర్‌:
అనారోగ్యంతో మహిళా కూలీ  ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడిన ఘటన కొత్తపేట పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో గురువారం జరిగింది. ఘటనపై పోలీసులు అనుమానాస్పద మతి కింద కేసు నమోదు చేశారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం మహబూబ్‌నగర్‌లోని అచ్చిరెడ్డి పాలెం నుంచి కూలీ పనుల కోసం కొంత మంది కూలీలు విజయవాడ  రూరల్‌ మండలంలోని జక్కంపూడికి తరలివచ్చారు. వీరంతా పోలవరం కాలువ పనులు చేస్తూ కాల్వ గట్టునే గుడిసెలు వేసుకుని నివసిస్తున్నారు.  వీరిలో బర్తాలు నాగన్న, వెంకటమ్మలకు పనుల కోసం రాగా, కొంత కాలంగా వెంకటమ్మకు అనారోగ్యంగా ఉంటుంది. గురువారం పనికి వెళ్లకుండా వెంకటమ్మ ఇంట్లోని దూలానికి ప్లాస్టిక్‌ వైర్‌తో ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. సమాచారం అందుకున్న కొత్తపేట పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని పంచనామా నిర్వహించి మతదేహాన్ని ప్రభుత్వాస్పత్రికి తరలించారు. 
 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement