inhealth
-
మహిళా కూలీ ఆత్మహత్య
చిట్టినగర్: అనారోగ్యంతో మహిళా కూలీ ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడిన ఘటన కొత్తపేట పోలీస్ స్టేషన్ పరిధిలో గురువారం జరిగింది. ఘటనపై పోలీసులు అనుమానాస్పద మతి కింద కేసు నమోదు చేశారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం మహబూబ్‌నగర్‌లోని అచ్చిరెడ్డి పాలెం నుంచి కూలీ పనుల కోసం కొంత మంది కూలీలు విజయవాడ రూరల్ మండలంలోని జక్కంపూడికి తరలివచ్చారు. వీరంతా పోలవరం కాలువ పనులు చేస్తూ కాల్వ గట్టునే గుడిసెలు వేసుకుని నివసిస్తున్నారు. వీరిలో బర్తాలు నాగన్న, వెంకటమ్మలకు పనుల కోసం రాగా, కొంత కాలంగా వెంకటమ్మకు అనారోగ్యంగా ఉంటుంది. గురువారం పనికి వెళ్లకుండా వెంకటమ్మ ఇంట్లోని దూలానికి ప్లాస్టిక్ వైర్‌తో ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. సమాచారం అందుకున్న కొత్తపేట పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని పంచనామా నిర్వహించి మతదేహాన్ని ప్రభుత్వాస్పత్రికి తరలించారు. -
వడదెబ్బతో స్పీకర్‌కు అస్వస్థత
చిట్యాల: తెలుగు రాష్ట్రాల్లో ఎండలు మండిపోతున్నాయి. గడిచిన వారం రోజుల్లో వడదెబ్బ మృతుల సంఖ్య దాదాపు 40కి చేరుకుంది. తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ మధుసూదనాచారి సైతం వడదెబ్బకు గురయ్యారు. రెండు రోజులుగా తన నియోజకవర్గం భూపాలపల్లిలో పలు అభివృద్ధి పనుల ప్రారంభోత్సవాలు, సమీక్షల్లో పాల్గొంటున్న ఆయన శుక్రవారం ఒక్కసారిగా అస్వస్థతతకు గురయ్యారు. దీంతో అధికారులు, కార్యకర్తలు ఆయనను ఆస్పత్రికి తరలించారు. వరంగల్ జిల్లా రేగొండ మండలంలోని సుల్తాన్‌పూర్‌లో శుక్రవారం రెండు చెరువుల పునరుద్ధరణ పనులు ప్రారంభించిన స్పీకర్ ఆతర్వాత చిట్యాల మండలంలోని ఒడితలలో సీసీరోడ్లకు శంకుస్థాపన చేశారు. అనంతరం కొత్తపేటలో టీఆర్ఎస్ నాయకుడి ఇంట్లో మధ్యాహ్నం భోజనం ముగించుకుని చల్లగరిగెలోని నల్లకుంట చెరువు పనులను ప్రారంభించి, చిట్యాలలో 50 పడకల సామాజిక వైద్యశాల పనులకు భూమి పూజ చేశారు. ఈ సందర్భంగా ఆస్పత్రిలో కొద్ది సేపు విలేకరులతో మాట్లాడారు. కొద్దిసేపటికే కళ్లు తిరుగుతున్నాయని చెప్పడంతో సివిల్ ఆస్పత్రి వైద్యులు బీపీ చెక్ చేశారు. బీపీ ఎక్కువగా ఉంది. వెంటనే షుగర్ పరీక్ష చేసి, ఈసీజీ తీయించారు. అరగంట పాటు విశ్రాంతి కల్పించి హైదరాబాద్ నిమ్స్ ఆస్పత్రికి వెళ్లాలని సూచించారు. అక్కడి నుంచి స్పీకర్ హైదరాబాద్‌కు బయలుదేరగా.. పరకాల వరకు వచ్చే సరికి మరోసారి కళ్లు తిరుగుతున్నాయని స్పీకర్ చెప్పడంతో పార్టీ నాయకులు వెంటనే పరకాలలోని ఓ ప్రైవేట్ నర్సింగ్‌హోమ్‌లో చేర్పించారు. ప్రస్తుతం స్పీకర్ ఆరోగ్యం మెరుగ్గానే ఉందని, రాత్రికి డిశ్చార్జ్ చేస్తామని వైద్యులు తెలిపారు. కాగా, గతేడాది వేసవిలోనూ స్పీకర్ మధుసూదనాచారి వడదెబ్బకు గురయ్యారు. -
రోహిత్ తల్లికి అస్వస్థత, ఆస్పత్రికి తరలింపు
హైదరాబాద్: దివంగత విద్యార్థి వేముల రోహిత్ తల్లి రాధిక అస్వస్థతకు గురయ్యారు. ఆదివారం రాత్రి ఒక్కసారిగా ఛాతిలో నొప్పిరావడంతో విద్యార్థులు ఆమెను ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం రాధిక గచ్చిబౌలీలోని కాంటినెంటల్ ఆసుపత్రిలో చికిత్సపొందుతున్నారు. రోహిత్ ఆత్మహత్యకు కారకులైనవారిపై చర్యలు తీసుకోవాలంటూ హెచ్ సీయూలో విద్యార్థులు చేస్తున్న దీక్షను బలపరుస్తూ రాధిక కూడా వర్సిటీలోనే బైఠాయించిన సంగతి తెలిసిందే. తీవ్ర ఒత్తిడే ఆమె అస్వస్థతకు కారణమని తెలుస్తోంది. కాగా, సోమవారం విద్యార్థులు తలపెట్టిన ఛలో హెచ్ సీయూ కార్యక్రమానికి కొద్ది గంటలముందు రోహిత్ మాతృమూర్తి ఆసుపత్రిపాలవ్వటంతో విద్యార్థులు ఆందోళన చెందుతున్నారు. -
ఇళయరాజాకు అస్వస్థత
సాక్షి, చెన్నై: ప్రఖ్యాత సినీ సంగీత దర్శకుడు ఇళయరాజా(72) అస్వస్థతతో ఇక్కడ అపోలో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఆయన గుండె సంబంధ అనారోగ్యానికి గురయ్యారని, ప్రస్తుతం ఆరోగ్య పరిస్థితి నిలకడగానే ఉందని డాక్టర్లు తెలిపారు. ఒంట్లో నలతగా ఉండడంతో శుక్రవారం ఆయన ఆస్పత్రిలో చేరారు. డాక్టర్లు ఆయనకు గుండె, జీర్ణాశయానికి సంబంధించిన పలు పరీక్షలు నిర్వహించారు. ఇళయరాజా ఇదివరకు గుండెకు సర్జరీ చేయించుకున్నారు. ఆయన ఇటీవల యూట్యూబ్‌లో సొంత మ్యూజిక్ చానల్‌ను, ఓ వెబ్‌సైట్‌ను ప్రారంభించారని, ఆ సందర్భంగా పలు టీవీ చానళ్లకు ఇచ్చిన ఇంటర్వ్యూల్లో అధికంగా మాట్లాడ్డంతో అనారోగ్యానికి గురై ఉండొచ్చని సినీ వర్గాలు చెప్పాయి. -
ఇళయరాజాకు అనారోగ్యం: ఆస్పత్రిలో చేరిక
చెన్నై: దిగ్గజ సంగీత దర్శకుడు, మెస్ట్రో ఇళయరాజా (72) ఆసుపత్రిలో చేరారు. అనారోగ్యంతో బాధపడుతున్న ఆయనను కుటుంబసభ్యులు శుక్రవారం రాత్రి చెన్నైలోని అపోలో ఆసుపత్రిలో చేర్చారు. కాగా, ప్రస్తుతం ఆయన పరిస్థితి ఎలా ఉందనే విషయంపై వైద్యులు ఇంకా ఎలాంటి ప్రకటన విడుదల చేయలేదు. పెద్దగా ఆందోళన చెందాల్సిన పనిచేదని విశ్వసనీయ వర్గాలు చెబుతున్నప్పటికీ ఇళయరాజా ఆస్పత్రిలో చేరారన్న వార్త ఆయన అభిమానులను కలవరపాటుకు గురిచేసింది. -
అనారోగ్యంతో పులి మృతి
శివమొగ్గ: తాలూకలోని త్యావరకొప్ప పులి - సింహధామంలో కొంత కాలంగా కిడ్నీల అనారోగ్యంతో బాధపడుతున్న ‘లవ’ అనే 14 సంవత్సరాల పులి మృతి చెందినట్లు అటవీ శాఖ అధికారులు తెలిపారు. మూడు నెలల నుంచి తీవ్రమైన అనారోగ్యంతో బాధపడుతున్న ఈ పులి ఇటీవల ఆహారాన్ని కూడా తీసుకునేందుకు ఇబ్బంది పడుతూ ఉండేదని తెలిపారు. సఫారీ డాక్టర్లు చికిత్సలు అందించేవారని శుక్రవారం ఉదయం పరిస్థితి విషమించడంతో లవ మృతి చెందినట్లు వివరించారు. త్యావరకొప్పె పులి- సింహధామంలో మొత్తం 10 పులులు ఉండేవని, శుక్రవారం లవ మృతి చెందడంతో ప్రస్తుతం ఇక్కడ పులుల సంఖ్య 9కి చేరిందని ప్రాణి సంరక్షణ అధికారి మోహన్‌కుమార్ తెలిపారు. అన్నారు. గతంలోను లవ క్యాన్సర్‌తో బాధపడేదని, చికిత్స కోసం బెంగళురులోని బన్నేరుఘట్ట ఉద్యానవనానికి తీసుకెళ్లి రెండేళ్ల పాటు అక్కడే ఉంచి, ఆరోగ్యం మెరుగైన తర్వాత తీసుకువచ్చినట్లు పేర్కొన్నారు. 14 సంవత్సరాల క్రితం ఒకే పులికి జన్మించిన లవ, కుశ రెండు కవలల పులులని, కొంత కాలంగా కుశ అనే పులికి కూడ అనారోగ్యంగా ఉందని, అయితే చికిత్సకు కుశ స్పందిస్తుందని డాక్టర్లు తెలిపారు. రెండు ఒకే సమయంలో కవలలుగా జన్మించిన లవ మృతి చెందడంతో కుశకు కూడ ఏమవుతుందో అన్న ఆందోళన అధికారుల్లో నెలకొంది.