రోహిత్ తల్లికి అస్వస్థత, ఆస్పత్రికి తరలింపు | rohith mother radhika hasbeen hospitalised due to chest pain | Sakshi
Sakshi News home page

రోహిత్ తల్లికి అస్వస్థత, ఆస్పత్రికి తరలింపు

Published Sun, Jan 24 2016 11:26 PM | Last Updated on Sun, Sep 3 2017 4:15 PM

రోహిత్ తల్లి రాధిక(ఫైల్ ఫొటో)

రోహిత్ తల్లి రాధిక(ఫైల్ ఫొటో)

హైదరాబాద్: దివంగత విద్యార్థి వేముల రోహిత్ తల్లి రాధిక అస్వస్థతకు గురయ్యారు. ఆదివారం రాత్రి ఒక్కసారిగా ఛాతిలో నొప్పిరావడంతో విద్యార్థులు ఆమెను ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం రాధిక గచ్చిబౌలీలోని కాంటినెంటల్ ఆసుపత్రిలో చికిత్సపొందుతున్నారు.

రోహిత్ ఆత్మహత్యకు కారకులైనవారిపై చర్యలు తీసుకోవాలంటూ హెచ్ సీయూలో విద్యార్థులు చేస్తున్న దీక్షను బలపరుస్తూ రాధిక కూడా వర్సిటీలోనే బైఠాయించిన సంగతి తెలిసిందే. తీవ్ర ఒత్తిడే ఆమె అస్వస్థతకు కారణమని తెలుస్తోంది. కాగా, సోమవారం విద్యార్థులు తలపెట్టిన ఛలో హెచ్ సీయూ కార్యక్రమానికి కొద్ది గంటలముందు రోహిత్ మాతృమూర్తి ఆసుపత్రిపాలవ్వటంతో విద్యార్థులు ఆందోళన చెందుతున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement