రమ్య యాక్టు తేవాలి
నల్లకుంట: జూబ్లీహిల్స్లో జూలై 1న జరిగిన రోడ్డు ప్రమాద ఘటనలు పునరావృతం కాకుండా రమ్య పేరిట యాక్టు తేవాలని దివంగత రమ్య తల్లి రాధిక ప్రభుత్వాన్ని కోరారు. నిర్భయం చట్టం తరహాలో ‘రమ్య’ యాక్టును రూపొందించాలని కోరారు. మంగళవారం డీడీ కాలనీలో విలేకరులతో మాట్లాడుతూ తిథి ప్రకారం రమ్య పుట్టిన రోజైన ఆగష్టు 24న విద్యాసంస్థల్లో రమ్య ఆత్మశాంతి కోసం రెండు నిమిషాలు మౌనం పాటించాలని కోరారు. మద్యం మత్తులో యువకులు చేసిన తప్పిదానికి నాలుగు కుటుంబాలు, మూడు తరాలు బలయ్యాయన్నారు.
మద్యానికి బానిసలవుతున్న యువకులకు బుద్ధి చెప్పేందుకు రమ్య యాక్టును తీసుకు రావాల్సిన అవసరం ఉందన్నారు. రమ్య ఘటన తర్వాత కూడా అనేక సంఘటనలు జరుగుతుండటం దారుణమన్నారు. అన్ని పాఠశాలల్లో బుధవారం ప్రార్ధన సమయంలో రెండు నిమిషాలు మౌనం పాటించి రమ్యకు నివాళులర్పించి, తమకు మద్దతు తెలపాలని విజ్ఞప్తి చేశౠరు. ప్రజలు, విద్యా సంస్థల మద్దతుతో రమ్య యాక్టును సాధిస్తామని, అందుకు ప్రభుత్వం సహకరిస్తుందని వారు ఆశాభావం వ్యక్తం చేశారు.