అనారోగ్యం బారిన ‘కుశ’
శివమొగ్గ: తాలూకలోని త్యావరకొప్ప పులి - సింహధామంలో కొంత కాలంగా కిడ్నీల అనారోగ్యంతో బాధపడుతున్న ‘లవ’ అనే 14 సంవత్సరాల పులి మృతి చెందినట్లు అటవీ శాఖ అధికారులు తెలిపారు. మూడు నెలల నుంచి తీవ్రమైన అనారోగ్యంతో బాధపడుతున్న ఈ పులి ఇటీవల ఆహారాన్ని కూడా తీసుకునేందుకు ఇబ్బంది పడుతూ ఉండేదని తెలిపారు.
సఫారీ డాక్టర్లు చికిత్సలు అందించేవారని శుక్రవారం ఉదయం పరిస్థితి విషమించడంతో లవ మృతి చెందినట్లు వివరించారు. త్యావరకొప్పె పులి- సింహధామంలో మొత్తం 10 పులులు ఉండేవని, శుక్రవారం లవ మృతి చెందడంతో ప్రస్తుతం ఇక్కడ పులుల సంఖ్య 9కి చేరిందని ప్రాణి సంరక్షణ అధికారి మోహన్‌కుమార్ తెలిపారు. అన్నారు. గతంలోను లవ క్యాన్సర్‌తో బాధపడేదని, చికిత్స కోసం బెంగళురులోని బన్నేరుఘట్ట ఉద్యానవనానికి తీసుకెళ్లి రెండేళ్ల పాటు అక్కడే ఉంచి, ఆరోగ్యం మెరుగైన తర్వాత తీసుకువచ్చినట్లు పేర్కొన్నారు.
14 సంవత్సరాల క్రితం ఒకే పులికి జన్మించిన లవ, కుశ రెండు కవలల పులులని, కొంత కాలంగా కుశ అనే పులికి కూడ అనారోగ్యంగా ఉందని, అయితే చికిత్సకు కుశ స్పందిస్తుందని డాక్టర్లు తెలిపారు. రెండు ఒకే సమయంలో కవలలుగా జన్మించిన లవ మృతి చెందడంతో కుశకు కూడ ఏమవుతుందో అన్న ఆందోళన అధికారుల్లో నెలకొంది.