రామప్పకు యునెస్కో గుర్తింపు!
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రానికి తొలి ప్రపంచ వారసత్వ కట్టడం హోదా తెచ్చిపెట్టే బాధ్యత ను భుజాలకెత్తుకున్న రామప్ప దేవాలయం ఈ ఏడాది యునెస్కో తలుపు తట్టబోతోంది. గతేడాదే ఈ ప్రయత్నం జరిగినా చివరి నిమి షంలో కేంద్ర ప్రభుత్వం రామప్ప ప్రతిపాద నను పెండింగ్‌లో పెట్టి.. గుజరాత్‌లోని అహ్మదాబాద్ సమీపంలో ఉన్న మరో నిర్మాణ ప్రతిపాదనను యునెస్కోకు పంపింది. అయి తే ఈ ఏడాది రామప్ప ప్రతిపాదనను పంపేం దుకు కేంద్రం సుముఖత వ్యక్తం చేసింది. దీంతో రామప్ప దేవాలయ ప్రత్యేకతలతో కూడిన డోజియర్‌ను కేంద్ర పురావస్తు శాఖ హైదరాబాద్ విభాగం మూడు రోజుల కింద కేంద్ర ప్రభుత్వానికి పంపింది.
ఆ ఒక్క నిబంధనతో..
ప్రపంచ వారసత్వ హోదా పొందాలంటే.. నిర్ధారిత కట్టడం/ప్రాంతానికి నిర్దిష్ట పరిధిలో ఎలాంటి ప్రైవేటు నిర్మాణాలు ఉండొద్దనేది యునెస్కో ప్రధాన నిబంధన. ఈ నిబంధన కారణంగానే మన దేశంలోని చాలా కట్టడాలు యునెస్కో గుర్తింపు దక్కించుకోలేకపోతున్నా యి. గతంలో చార్మినార్, గోల్కొండ, కుతుబ్‌షాహీ టూంబ్స్, వేయి స్తంభాల గుడి, వరంగల్ కోటలు ఇలాగే తిరస్కరణకు గురయ్యాయి. కానీ రామప్ప దేవాలయానికి చేరు వలో ఎలాంటి ప్రైవేటు నిర్మాణాలు లేనందున ఆ నిబంధన అడ్డుకాబోదు. ఆలయ నిర్మాణ విశిష్టతలు కూడా గొప్పగా ఉండటంతో దానికి యునెస్కో గుర్తింపు తథ్యమన్న భావన వ్యక్త మవుతోంది.
హైదరాబాద్‌లో జరు గుతున్న అంతర్జాతీయ పురావస్తు సదస్సు లోనూ ఇదే అభిప్రాయం వ్యక్తమైంది. ‘‘ఈసా రి రామప్ప దేవాలయం డోజియర్‌ను యునెస్కోకు పంపుతున్నారు. దానికి కేంద్రం ఆమోదం లభించింది. యునెస్కో పరిశీలనలో రామప్ప దేవాలయానికి మంచి మార్కులే వస్తాయని ఆశిస్తున్నాం. అదే జరిగితే తెలం గాణలోని ఓ కట్టడానికి తొలి ప్రపంచ వార సత్వ హోదా వచ్చినట్టవుతుంది..’’అని రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు పాపారావు పేర్కొన్నారు.