world heritage
-
కుతుబ్‌షాహీల సమాధులకు కొత్త లుక్
సాక్షి, హైదరాబాద్: మిరుమిట్లు గొలిపేలా కుతుబ్‌షాహీల సమాధులకు మరమ్మతులు సాగుతున్నాయి. ఐదొందల ఏళ్ల తర్వాత జిగేల్మనేలా మెరవనున్నాయి. గోల్కొండ సమీపంలోని వంద ఎకరాల పచ్చని బయళ్ల మధ్య పాలవర్ణంతో మహానగరానికే ఓ కొత్త ఐకానిక్‌గా మిగలనున్నాయి. గోల్కొండ రాజ్యం నాటి చరిత్ర, సంస్కృతి, గొప్పదనానికి ఈ సమాధులు ఓ ఆనవాళ్లు. సుమారు వంద కోట్ల రూపాయల వ్యయంతో ఆగాఖాన్ కల్చరల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఆరేళ్లుగా సాగుతున్న పనులు త్వరలోనే పూర్తి కానున్నాయి. ఇప్పటికే ఇబ్రహీం కులీ సమాధి, మృతి చెందిన తరువాత రాజుల భౌతికకాయాలకు స్నానాలు చేయించే గదితోపాటు కొందరు రాజుల కుటుంబ సభ్యుల సమాధులకు మరమ్మతులు పూర్తయ్యాయి. ఇండో పర్షియన్, ఇరానియన్ శైలిలో నిర్మితమైన ఈ సమాధులను సాలార్జంగ్–3 హయాంలో వందేళ్ల క్రితం మరమ్మతులు చేశారు. ప్రస్తుతం ఎలాంటి రసాయనాల వాడకుండా 500 ఏళ్ల క్రితం వాడిన ముడి పదార్థాలతోనే వన్నెలద్దుతున్నారు. బెంగాలీ వృత్తి నిపుణులు అంగుళమంగుళమూ ప్రత్యేకత ఉండేలా శ్రద్ధ తీసుకుంటున్నారు. వరల్డ్ హెరిటేజ్ సైట్‌కు మళ్లీ... వీలైనంత త్వరగా ఈ మరమ్మతులు పూర్తి చేసి యునెస్కో ప్రకటించే వరల్డ్ హెరిటేజ్ సైట్ కోసం మళ్లీ ప్రతిపాదనలు పంపే దిశగా అధికార యంత్రాంగం ప్రతిపాదనలు సిద్ధం చేస్తోంది. ముఖ్యంగా మానవ నిర్మితమై, చూసే వారికి అత్యద్భుతమనిపించే సైట్లనే వరల్డ్ హెరిటేజ్ సైట్లుగా యునెస్కో ప్రకటిస్తుంది. గతంలో చార్మినార్, గోల్కొండ కోటలకు ఈ గుర్తింపునిచ్చే ప్రతిపాదనలు పంపినా వాటికి తుది జాబితాలో చోటు దక్కలేదు. తాజాగా కుతుబ్‌షాహీల సమాధులకు ఔరా అనే స్థాయిలో జరుగుతున్న మరమ్మతుల అనంతరం తప్పకుండా అంతర్జాతీయ గుర్తింపు వస్తుందని చరిత్రకారులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. సమాధుల నవీకరణ పనులను ఎప్పటికప్పుడు యూఎస్, యూకే ప్రతినిధులు సైతం సందర్శిస్తూ సలహాలు, సూచనలు ఇస్తుండటం విశేషం. వరల్డ్ హెరిటేజ్ సైట్ హోదా రావాలంటే... యునెస్కో ప్రత్యేక బృందం వరల్డ్ హెరిటేజ్ సైట్‌కు అధికారిక హోదానిస్తుంది. హోదా దక్కాలంటే నిర్దేశించిన పది పాయింట్లలో మెజారిటీ అంశాలపై ప్రతినిధులు సంతృప్తి వ్యక్తం చేయాల్సి ఉంది. ముఖ్యంగా ఆ కట్టడాలు మానవ నిర్మితమై ఉండాలి, చరిత్ర, సంస్కృతికి సంబంధించిన మానవీయ విలువలు వ్యక్తమవుతూ, ప్రపంచంలోనే ప్రకృతిలో కలిసిపోయేంత అత్యంత అద్భుతమైన నిర్మాణ సొగసును సొంతం చేసుకుని ఉండాలన్న నిబంధనలున్నాయి. ఐతే, ఈ నిబంధనలకు లోబడే కుతుబ్ షాహీ సమాధులను సిద్ధం చేస్తుండటంతో ఈసారి తప్పక వరల్డ్ హెరిటేజ్ సైట్ హోదా వస్తుందన్న విశ్వాసాన్ని ఆగాఖాన్ ఫౌండేషన్ ప్రతినిధులు వ్యక్తం చేస్తున్నారు. ఈ సమాధుల చరిత్ర ఇదీ 1518 –1687 మధ్య కాలంలో గోల్కొండను పాలించిన రాజుల సమాధులే ఇవీ. ఈ నిర్మాణాలు దేనికదే ప్రత్యేకం. గుండ్రని గోపురం, అష్టకోణ నిర్మాణంలోని సమాధిశాలలున్నాయి. సుల్తాన్ కులీ, జంషెడ్ కులీ, సుబాన్ కులీ, ఇబ్రహీం కులీ, మహ్మద్ కులీ, సుల్తాన్ అహ్మద్, అబ్దుల్లా కుతుబ్‌షా, అబుల్ హసన్ తానీషాలు గోల్కొండ రాజ్యాన్ని పాలించారు. వారు తమకు తామే సమాధి శాలలు నిర్మించుకోవటం విశేషం. ఇప్పటికే దేశంలో.. దేశంలో ఇప్పటికే 37 నిర్మాణాలకు యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్‌గా గుర్తింపు వచ్చింది. ఇందులో తాజ్‌మహల్, ఎర్రకోట, కుతుబ్ మినార్, అజంతా, ఎల్లోరా, హంపీ, ఖజరహో, హుమాయున్ సమాధి ఉన్నాయి. ప్రపంచ వ్యాప్తంగా చూస్తే హెరిటేజ్ సైట్లు అధికంగా ఇటలీలో 54, చైనాలో 53, స్పెయిన్‌లో 47, జర్మనీలో 44 కట్టడాలకు యునెస్కో గుర్తింపునిచ్చింది. -
రామప్పకు యునెస్కో గుర్తింపు!
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రానికి తొలి ప్రపంచ వారసత్వ కట్టడం హోదా తెచ్చిపెట్టే బాధ్యత ను భుజాలకెత్తుకున్న రామప్ప దేవాలయం ఈ ఏడాది యునెస్కో తలుపు తట్టబోతోంది. గతేడాదే ఈ ప్రయత్నం జరిగినా చివరి నిమి షంలో కేంద్ర ప్రభుత్వం రామప్ప ప్రతిపాద నను పెండింగ్‌లో పెట్టి.. గుజరాత్‌లోని అహ్మదాబాద్ సమీపంలో ఉన్న మరో నిర్మాణ ప్రతిపాదనను యునెస్కోకు పంపింది. అయి తే ఈ ఏడాది రామప్ప ప్రతిపాదనను పంపేం దుకు కేంద్రం సుముఖత వ్యక్తం చేసింది. దీంతో రామప్ప దేవాలయ ప్రత్యేకతలతో కూడిన డోజియర్‌ను కేంద్ర పురావస్తు శాఖ హైదరాబాద్ విభాగం మూడు రోజుల కింద కేంద్ర ప్రభుత్వానికి పంపింది. ఆ ఒక్క నిబంధనతో.. ప్రపంచ వారసత్వ హోదా పొందాలంటే.. నిర్ధారిత కట్టడం/ప్రాంతానికి నిర్దిష్ట పరిధిలో ఎలాంటి ప్రైవేటు నిర్మాణాలు ఉండొద్దనేది యునెస్కో ప్రధాన నిబంధన. ఈ నిబంధన కారణంగానే మన దేశంలోని చాలా కట్టడాలు యునెస్కో గుర్తింపు దక్కించుకోలేకపోతున్నా యి. గతంలో చార్మినార్, గోల్కొండ, కుతుబ్‌షాహీ టూంబ్స్, వేయి స్తంభాల గుడి, వరంగల్ కోటలు ఇలాగే తిరస్కరణకు గురయ్యాయి. కానీ రామప్ప దేవాలయానికి చేరు వలో ఎలాంటి ప్రైవేటు నిర్మాణాలు లేనందున ఆ నిబంధన అడ్డుకాబోదు. ఆలయ నిర్మాణ విశిష్టతలు కూడా గొప్పగా ఉండటంతో దానికి యునెస్కో గుర్తింపు తథ్యమన్న భావన వ్యక్త మవుతోంది. హైదరాబాద్‌లో జరు గుతున్న అంతర్జాతీయ పురావస్తు సదస్సు లోనూ ఇదే అభిప్రాయం వ్యక్తమైంది. ‘‘ఈసా రి రామప్ప దేవాలయం డోజియర్‌ను యునెస్కోకు పంపుతున్నారు. దానికి కేంద్రం ఆమోదం లభించింది. యునెస్కో పరిశీలనలో రామప్ప దేవాలయానికి మంచి మార్కులే వస్తాయని ఆశిస్తున్నాం. అదే జరిగితే తెలం గాణలోని ఓ కట్టడానికి తొలి ప్రపంచ వార సత్వ హోదా వచ్చినట్టవుతుంది..’’అని రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు పాపారావు పేర్కొన్నారు. -
రా రమ్మని.. రా రా రమ్మని
ఓరుగల్లుకు పెరిగిన పర్యాటకుల రాక ఈ ఏడు అరకోటి మంది సందర్శన ఏడాదిలో రెట్టింపు సంఖ్యలో తాకిడి సాక్షి, హన్మకొండ : కాకతీయుల చారిత్రక వైభవం తెలుసుకోవడంతోపాటు ఇక్కడి ప్రకృతి అందాలను తిలకించే పర్యాటకుల సంఖ్య గణనీయంగా పెరిగింది. రాష్ట్ర నలుమూలల నుంచే కాకుండా విదేశాల నుంచి సైతం పర్యాటకులు వరంగల్‌కు వచ్చేందుకు ఆసక్తి చూపారు. ఈఏడాది ఇప్పటికే అరకోటి మందికి పైగా పర్యాటకులు జిల్లాకు వచ్చారు. వీరిలో రికార్డు స్థాయిలో 608 మంది విదేశీ టూరిస్టులు ఉండడం విశేషం. మేడారం మహా జాతరను మినహాయిస్తే ఈ స్థాయిలో జిల్లాకు పర్యాటకులు రావడం ఇదే ప్రథమం. కాకతీయ ఉత్సవాల ప్రభావం కాకతీయ రాజుల రాజధాని వరంగల్ . వారి పాలనకు గుర్తుగా ఖిలావరంగల్, వేయిస్తంభాల ఆలయాలతోపాటు కళ్లు చెదిరే శిల్పసంపదకు నెలవైన రామప్ప ఆలయం, గణపురం కోటగుళ్లు వంటి చారిత్రక ప్రాంతాలు జిల్లాలో ఉన్నాయి. అంతేకాదు... లక్నవరం, పాకాల, గణపసముద్రం, ఏటూరునాగారం అ భయారణ్యం వంటి ప్రకృతి అందాలు జిల్లా సొంతం. అన్నీ ఉన్నప్పటికీ సరైన ప్రచారం లభించక హైదరాబాద్‌తో పో ల్చితే జిల్లాకు వచ్చే పర్యాటకుల సంఖ్య గతంలో తక్కువగా ఉండేది. అయితే ఇక్కడి చారిత్రక ప్రాంతాలను వరల్డ్ హెరి టేజ్ సైట్స్‌గా గుర్తించాలనే లక్ష్యంతో రాష్ర్ట ప్రభుత్వం 2012 డిసెంబర్లో కాకతీయ ఉత్సవాలను ప్రారంభిం చింది. ఈ నేపథ్యంలో మీడియా సైతం ఓరుగల్లులోని ప ర్యాటక ప్రాంతాల గురించి విస్తృతంగా ప్రచారం చేసింది. ఈ క్రమంలో 2012-13 ఏడాదికి గాను వరంగల్ నగరం బెస్ట్ హెరిటేజ్ సిటీగా కేంద్ర ప్రభుత్వ అవార్డును గెలుచుకుంది. వీటి ప్రభావంతో జిల్లాకు వచ్చే పర్యాటకుల సంఖ్య గణనీయంగా పెరిగింది. 2012లో జిల్లాకు వచ్చిన పర్యాట కుల సంఖ్య 23,00,000 ఉంది. జిల్లా పర్యాటక శాఖ ఆది వారం వెల్లడించిన గణాంకాల ప్రకారం 2013 జనవరి నుం చి సెప్టెంబర్ వరకు 51,92,266 మంది పర్యాటకులు జి ల్లాను సందర్శించారు. ఇతర రాష్ట్రాలకు చెందిన పర్యాటకు లు 2,27,079 మంది, విదేశీ పర్యాటకులు 608 మంది ఉ న్నారు. ఏడాది కాలంలోనే పర్యాటకుల సంఖ్య రెట్టిం పైం ది. ఈ తొమ్మిది నెలల కాలంలో మార్చిలో అత్యధికంగా 14,18,652 మంది పర్యాటకులు సందర్శించారు.