గురజాడ పురస్కారానికి జిల్లా కవుల ఎంపిక
Published Fri, Feb 3 2017 12:27 AM | Last Updated on Tue, Sep 5 2017 2:44 AM
– ఈనెల 8న తిరుపతిలో పురస్కారం అందుకోనున్న కర్నూలు కవులు
కర్నూలు(వైఎస్‌ఆర్ సర్కిల్): గురజాడ వేంకట అప్పారావు అంతర్జాతీయ ఫౌండేషన్ ఏటా నిర్వహించే గురజాడ స్ఫూర్తి ఉత్సవాలు–2017కు జిల్లాకు చెందిన 10 మంది కవులు ఎంపికైనట్లు ఫౌండేషన్ అంతర్జాతీయ ప్రధాన కార్యదర్శి పుల్లా రామాంజనేయులు గురువారం తెలిపారు. జిల్లాకు 10 మంది చొప్పున రాయలసీమ జిల్లాల్లో 40 మందిని ఎంపిక చేశామన్నారు. కర్నూలు సిల్వర్ డిగ్రీ కళాశాల తెలుగుశాఖాధిపతి డాక్టర్ విజయ్‌కుమార్, విశ్వవాణి కోచింగ్ సెంటర్ అధినేత డాక్టర్ ఎన్.కే. మద్దిలేటి, రాయలసీమ విశ్వవిద్యాలయం ఆంగ్ల అధ్యాపకురాలు డాక్టర్ పేరం ఇందిరాదేవి, నంద్యాల దంతవైద్యుడు డాక్టర్ కిశోర్‌కుమార్, కర్నూలు జిల్లా సాహితీ స్రవంతి అధ్యక్ష, కార్యదర్శులు జంధ్యాల రఘుబాబు, కెంగార మోహన్, మద్దికెర జీవశాస్త్ర ఉపాధ్యాయుడు కే.సురేష్‌బాబు, కొలిమిగుండ్ల కళాస్రవంతి వ్యవస్థాపక కార్యదర్శి పల్లోలి శేఖర్‌బాబు, అభ్యుదయ రచయితల సంఘం జిల్లా నాయకుడు కే.సీ మల్లికార్జున, రచయిత సోమభూపాల్‌కు ఈ పురస్కారాలను జ్యూరీ కమిటీ ప్రకటించిందన్నారు. ఈనెల 8న తిరుపతిలోని కొరటాల సత్యనారాయణ విజ్ఞాన కేంద్రంలో జరిగే సాహిత్య సభలో వీరికి పురస్కారాలను అందజేయనున్నట్లు ఆయన పేర్కొన్నారు.
Advertisement
Advertisement